ఆంధ్రప్రదేశ్‌

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా పంచుమర్తి, జూపూడి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 12: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు టిడిపి నాయకత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగా మాల వర్గానికి చెందిన జూపూడి ప్రభాకర్ (ప్రకాశం), బీసీ వర్గానికి చెందిన పంచుమర్తి అనూరాధ (కృష్ణా) పేర్లు దాదాపు ఖరారయినట్లు సమాచారం. ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారిద్దరి పేర్లను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అవకాశం కోల్పోతున్నట్టవుతుంది. నిజానికి ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తామని గతంలో బాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తనకు ఆ కోటాలో ఇచ్చినా ఫలితం ఉండదని, దానివల్ల ఇక వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి పోటీ చేసే అవకాశం ఉండదని రామసుబ్బారెడ్డి చాలాకాలం నుంచి వాదిస్తున్నారు. అయినా ఆయనను పార్టీ నాయకత్వం బుజ్జగిస్తూ వస్తోంది. నిజానికి రామసుబ్బారెడ్డిని వైసీపీలో చేరాలంటూ ఆయన వర్గీయులు చాలాకాలం నుంచి ఒత్తిడి చేస్తున్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి పెత్తనం ఎక్కువకావడాన్ని రామసుబ్బారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కొత్తగా పార్టీలో చేసిన ఆదినారాయణరెడ్డికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న అసంతృప్తితో ఉన్నారు. ఆ కారణంతోనే ఆయన ఇటీవల విశాఖలో జరిగిన మహానాడుకు దూరంగా ఉండటంతోపాటు, అదేరోజు తన వర్గీయులతో సమావేశమవడం సంచలనం సృష్టించింది. దానికితోడు ఆయన వైసీపీలో చేరేందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నారన్న సమాచారం కూడా నాయకత్వానికి లేకపోలేదు. అందుకే ఆయనకు బదులు బీసీ వర్గానికి చెందిన పంచుమర్తి అనూరాధ పేరును పరిగణనలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు విశే్లషిస్తున్నాయి. కాగా, అనూరాధ, జూపూడి పేర్లు గతంలో జరిగిన ఎన్నికల సమయంలోనే ఖరారయ్యాయి. జూపూడి పేరు ప్రకటించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఆయనకు ఎమ్మెల్సీ దక్కలేదు. దానితో ఈసారి అవకాశం ఇస్తానని బాబు హామీ ఇచ్చారు. ఇక చేనేత వర్గానికి చెందిన అనూరాధకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినా, తాత్కాలికం అన్న కారణంతో ఆమె దానిని నిరాకరించటంతో నాయకత్వం ఆమెను కొంతకాలం దూరం పెట్టింది. మళ్లీ బాబు వద్దకు వెళ్లి క్షమాపణ అడగడంతో తిరిగి ఆమెకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం అనూరాధ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, జూపూడి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు.