ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర పథకాలపై నిలదీయండి: సుజనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి టౌన్, జూన్ 12: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ప్రజా పథకాల ద్వారా లబ్ధిపొందని వారు ప్రజాప్రతినిధులను నిలదీసి మరి అడిగి ఆ పథకాలను వినియోగించుకోవాలని కేంద్ర శాస్తస్రాంకేతిక శాఖామంత్రి సుజనా చౌదరి ప్రజలకు సూచించారు. నెల్లూరు జిల్లా కావలిలో సోమవారం జరిగిన సబ్‌కాసాత్, సబ్‌కా వికాస్ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ముద్ర, స్వచ్చ్భారత్, వంటి ప్రతిష్టాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టిందని వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకొని వారి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన చెప్పారు. యువతి యువకులకు ఎంతో మేలు చేయాలన్న తలంపుతో ఎటువంటి గ్యారింటీ లేకుండా సుమారు 9లక్షల రూపాయిల పై మేర రుణాలు పొందవచ్చని వీటి ద్వారా వారు వ్యాపారాలు చేసుకొంటూ జీవితంలో స్థిరపడొచ్చన్న ఆలోచనతో నిరుద్యోగ సమస్య వుండకూడదనే నిర్ణయంతో ఈ పథకాలను ప్రధాని మోదీ ప్రవేశపెట్టారన్నారు. స్వచ్చ్భారత్ పథకం ద్వారా చాలా ప్రాంతాలు శుభ్రపడుతున్నాయన్నారు.