ఆంధ్రప్రదేశ్‌

భూములు కొల్లగొడితే తీవ్ర పరిణామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 12: పేదల భూములు బలవంతంగా లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ప్రభుత్వ తీరుకు ముదపాక భూ ఉద్యమం కనువిప్పు కలగాలని అఖిలపక్షం నాయకులు ఉద్ఘాటించారు. ముదపాక అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించే వ్యవహారంలో అధికార పార్టీ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాత్రపై నాయకులు మండిపడ్డారు. వివాదస్పద ముదపాక భూములను అఖిలపక్షం నేతలు వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి నేతృత్వంలో సోమవారం సందర్శించారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు నిరుపేదల భూములను కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. దళితులు, బిసిలను మభ్యపెట్టి బలవంతంగా భూములు సేకరించి, వాటిని విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ల్యాండ్ పూలింగ్‌కు అప్పగించడం ద్వారా కోట్లు కొల్లగొట్టేందుకు వ్యూహరచన చేశారన్నారు. దళితులకు, బిసిలకు ఇచ్చిన అసైన్డ్ భూములను కాజేసే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, తనయుడు లోకేష్ సహా జిల్లాకు చెందిన ఒక మంత్రి, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు యత్నిస్తున్నారని ఆరోపించారు. 13 జిల్లాల్లోనూ అధికార పార్టీ పెద్దలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇదే దోపిడీని కొనసాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం సాగిస్తున్న భూ దోపిడీని అడ్డుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకంకావడం హర్షించతగ్గ పరిణామమన్నారు. ముదపాక ఉద్యమం ద్వారా అన్ని రాజకీయ పార్టీలు అధికార పార్టీ పెద్దల భూ కుంభకోణాలను వెలుగులోకి తెచ్చి, వారిని ప్రజల్లో దోషులుగా నిలబెడతామన్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను కొల్లగొట్టేందుకు జరుగుతున్న కుట్రలను ఛేదించి, రైతులకు వారి భూములను తిరిగి ఇప్పిస్తామన్నారు. కార్యక్రమంలో అఖిలపక్షం ప్రతినిధులు నర్శింగరావు (సిపిఎం), ఎజె స్టాలిన్ (సిపిఐ), భీశెట్టి బాబ్జీ (లోక్‌సత్తా), జార్జి బంగారి (బిఎస్పీ), ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.