ఆంధ్రప్రదేశ్‌

డిసిఎంఎస్‌లో గోల్‌మాల్ ‘గోపాల’ం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూన్ 13: ప్రకాశం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డిసిఎంఎస్) గోపాల,గోపాల, సికిందర్ సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సొసైటీ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేయటం నిబంధనలకు విరుద్దమని జిల్లా కో ఆపరేటివ్ అధికారి ఎం శ్రీకాంత్ చెబుతుండగా తాను నిబంధనల ప్రకారమే చేశానని డిసిఎంఎస్ చైర్మన్ బీరం వెంకటేశ్వరరెడ్డి చెబుతున్నారు. ఈవ్యవహరంలో ఏడుగురు అసిస్టెంట్ రిజిస్ట్రార్లపై సస్పెన్షన్ వేటు వేశారు. అక్రమంగా ఏడుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటువేయటాన్ని ఉద్యోగసంఘాలు తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అసలు అధికారులు చెప్పేదానికి, చైర్మన్ చెప్పేదానికి పొంతన లేకుండా ఉంది. జిల్లా కో ఆపరేటివ్ అధికారి ఎం శ్రీకాంత్ కథనం మేరకు గోపాల.. గోపాల, సికిందర్ సినిమా డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించి 50 లక్షల రూపాయలకుపైగా సొసైటీ నగదును డ్రా చేశారు. ఈ నగదులో 22 లక్షల రూపాయల నగదు వచ్చిందని, మరో 28 లక్షల రూపాయల నగదు రావాల్సిఉందని ఆయన పేర్కొన్నారు. బైలా ప్రకారం ఈ వ్యవహరం చేయకుడదని ఆయన తెలిపారు. కాగా డిసిఎంఎస్ చైర్మన్ బీరం వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ బైలాప్రకారమే డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం చేశామన్నారు. గోపాల..గోపాల సినిమాకు సంబంధించి సురేష్ ప్రొడక్షన్ వారికి 20లక్షల రూపాయలు, రామలక్ష్మి క్రియోషన్స్‌కు 11 లక్షల రూపాయలు చెల్లించామన్నారు. కాగా గోపాల..గోపాల సినిమాకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం చేయలేదని, సికిందర్ సినిమా వ్యాపారం మాత్రమే చేశామన్నారు. సొసైటీ పాలకవర్గం ఆమోదం మేరకు ఈ వ్యాపారం చేశామని ఆయన తెలిపారు. సంస్ధను ఎట్టి పరిస్ధితుల్లోను నష్టపోనివ్వబోమని, నగదు త్వరలోనే 11లక్షల రూపాయలు డిస్ట్రిబ్యూటర్ నుండి వస్తాయని ఆయన పేర్కొన్నారు. మిగిలిన నగదు కూడా వస్తుందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఆయన తెలిపారు.
ఒక్కొక్కరిది ఒక్కో కథ..
ఎరువులు,పురుగుమందుల,విత్తనాలను రైతులకు పిఎసిఎస్‌ల ద్వారా అందించాల్సిన సొసైటీ సినిమా వ్యాపారం చేయటమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలాఉండగా సొసైటి ఆడిట్‌ను ఎస్ వెంకటేశ్వర్లు నిర్వహించారు. ఆ సమయంలో నిధులు పక్కదారి పట్టాయని రికవరీ చేయాలని రిపోర్టు చేయాల్సి ఉంది కాని అలా నివేదిక ఇవ్వకపోవడంతో సమస్య జఠిలమైంది. ఈవ్యవహారాన్ని కింది స్ధాయి కోఆపరేటివ్ అధికారులు ప్రత్యేక నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వ్యవహరించినందుకు సహకార శాఖ కమిషనర్ ఏడుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్ వేటుపడిన వారిలో డిసిఒ కార్యాలయ సూపరిండెంట్ వెంకటేశ్వరరెడ్డి, డిసిఒ కార్యాలయ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎస్ వెంకటేశ్వర్లు, ఒంగోలు సబ్‌డివిజన్ ఏఆర్ కె వెంకటేశ్వరరావు, గోపికృష్ణ, అద్దంకి సబ్‌డివిజన్ ఏఆర్ వి కోటిరెడ్డి, చీరాల సబ్‌డివిజన్ ఏఆర్ జి తాతాచారి, సీనియర్ ఇన్‌స్పెక్టర్ కె శ్రీనివాసరావు ఉన్నారు. ఇదిలాఉండగా ఏడుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటువేయటాన్ని నిరసిస్తూ డిసిఒ కార్యాలయ సిబ్బంది ఆందోళన బాట పట్టారు సిబ్బంది వేటువేసిన సస్పెన్షన్ వేటును ఎత్తివేయాలని ఆడిట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె వెంకటేశ్వర్లు, ఎపిఆర్‌ఎస్‌ఎ జిల్లా అధ్యక్షుడు కెఎల్ నరసింహరావు డిమాండ్ చేశారు. మొత్తంమీద డిసిఒ, చైర్మన్ చెబుతున్న కథనాలు వేర్వేరుగా ఉండటంతో ఆందోళన వ్యక్తవౌతోంది. ఈ కథనాలపై రాష్ట్రప్రభుత్వం నరసరావుపేట డివిజనల్ కోఆపరేటివ్ అధికారి పురుష్‌బాబును ఎంక్వయిరీ అధికారిగా నియమించారు.