ఆంధ్రప్రదేశ్‌

ఎక్కడి దొంగలు అక్కడే.. గప్‌చుప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 13: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విశాఖ భూముల కుంభకోణంపై ప్రభుత్వం నీళ్లు చల్లే ప్రయత్నాలు మొదలుపెట్టింది. లక్ష ఎకరాలు, సుమారు 20 వేల కోట్ల విలువైన భూముల కబ్జా, లేదా ఆయా భూములకు సంబంధించిన రికార్డులు తారుమారు జరిగాయని సాక్షాత్తూ కలెక్టర్ బహిర్గతం చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు సమర్థించారు. గడచిన వారం, పది రోజులుగా రెవెన్యూ అధికారులు చేసిన దర్యాప్తులో భూముల రికార్డుల తారుమారు, కబ్జాలు చాలా వరకూ నిజమేనని రుజువైంది. ఇదే విషయాన్ని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ నాలుగు రోజుల కిందట మీడియాకు వెల్లడించారు.
ప్రభుత్వంలో బాధ్యతాయతమైన పదవుల్లో ఉన్నవారి అనుచరులు, ప్రభుత్వ ఆశీస్సులతో కొందరు ఈ దందాలకు పాల్పడినట్టు ఆరోపణలు దండిగా వినిపిస్తున్నాయి. విశాఖలో భూ దందాపై ఈనెల 15న బహిరంగ విచారణ జరిపేందుకు వస్తున్నట్టు రెవెన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తి ప్రకటించారు. భారీ స్కాం బయట పడడంతో ప్రభుత్వం గుక్క తిప్పుకోలేకపోతోంది. ఈ స్కాం వలన విశాఖ నగర, ప్రభుత్వ ప్రతిష్టలు దిగజారాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, వ్యవస్థపై సామాన్యులకు నమ్మకం పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో బహిరంగ విచారణ జరిపితే, ప్రభుత్వం మరింత ఇరకాటంలో పడే అవకాశాలు ఉన్నాయి.
దీన్ని ముందుగానే ఊహించిన ప్రభుత్వం కలెక్టర్ ప్రవీణ్‌ను హుటాహుటిన రాజధానికి పిలిపించుకుంది. భూ కుంభకోణాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుంది. గురువారం ఇక్కడ జరగాల్సిన బహిరంగ విచారణ కార్యక్రమాన్ని రద్దు చేసి, దాని స్థానే రెవెన్యూ, పోలీస్, న్యాయశాఖల అధికారులతో ఒక దర్యాప్తు బృందాన్ని నియమించి, కుంభకోణంపై నీళ్లు చల్లేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ భారీ కుంభకోణంలో రెవెన్యూ శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి ఆర్డీవోల వరకూ భాగస్వాములుగా ఉన్నారు. తహశీల్దార్ల పాత్రయితే చెప్పలేనంతా ఉంది. ఇందులో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల రాక్త సంబంధీకుల్లో ఒకరు ముఖ్య పాత్ర పోషించిన దాఖలాలు ఉన్నాయి. రికార్డులను తారుమారు చేసింది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులైతే, వాటిపై డిజిటల్ సంతకాలు చేసింది తహశీల్దారులు. వీరందరినీ ప్రోత్సహించింది రెవెన్యూ శాఖ పెద్దలు, అధికార పార్టీ నాయకులు. అలాగే పోలీస్ శాఖ కూడా ఈ కుంభకోణంలో భాగస్వామిగా ఉంది. అనేక చోట్ల తమ భూములు కబ్జాకు గురయ్యాయని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే, కనీసం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. ముదపాకలోని డి పట్టా భూములను దారుణంగా కాజేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుని, పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం కనిపించలేదు. బాధితులు ఇచ్చిన ఎఫ్‌ఐఆర్‌ని పక్కన పెట్టి, నిందితులు తిరిగి బాధితులపై పెట్టిన కేసు ఎఫ్‌ఐఆర్‌ను ఆర్డీఓ కోర్టుకు అందించిన ఘనులు పోలీస్ శాఖలో ఉన్నారు. అటువంటప్పుడు ఈ రెండు శాఖలను దర్యాప్తులో భాగస్వాములను చేయడం ఎంతవరకూ సమంజసం? ఇక కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని ఏదో రకంగా వెకన్కు తెచ్చుకుంటారు. అక్రమంగా చేతులు మారిన ముదపాక భూములను తిరిగి బాధితులకు ఈ బృందం ఎలా అప్పగించగలుతుంది? అంతేకాదు, వేలాది మంది ప్రైవేటు వ్యక్తుల భూములను కబ్జాదారులు ఆక్రమించుకున్నారు. వీటిని తిరిగి ఎలా వెనక్కు తీసుకురాగలుగుతారు? ఈ కమిటీకి ఉన్న అధికారాలేంటి? ప్రభుత్వ, ప్రైవేటు భూముల రికార్డులను తారుమారు చేసిన అధికారులు, లేదా సిబ్బందిపై ఈ కమిటీ చర్యలు తీసుకోగలుగుతుందా? 15న జరగనున్న బహిరంగ విచారణకు పెద్ద సంఖ్యలో బాధితులు రావాలనుకుంటున్నారు. అయితే, ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లడంతో ప్రభుత్వంపై మరింత అసంతృప్తి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.