ఆంధ్రప్రదేశ్‌

పునరావాసం కల్పించేదాకా నిర్వాసితుల జోలికి వెళ్లం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం వల్ల భూములు కోల్పోయే రైతులకు 2013 భూసేకరణ చట్టం కింద పునరావాస సదుపాయం కల్పించేంత వరకు వారి జోలికి పోమని అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు చెప్పారు. ఏపి వ్యవసాయ కార్మికుల సంఘం తరఫున దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్లు కోర్టుకు తమ సమస్యలను విన్నవించారు. భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం ఇంతవరకు 50 నోటిఫికేషన్లు జారీ చేసిందన్నారు. కాని ఇందులో ఎక్కడా పునరావాస సదుపాయానికి సంబంధించిన వివరాలు లేవన్నారు. హైకోర్టు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ భూములు కోల్పోయే రైతులు, వ్యవసాయ కార్మికులకు చట్టం ప్రకారం పునరావాస సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీని కోరామన్నారు. అనంతరం హైకోర్టు ఈ కేసు విచారణను మూడు వారాల పాటు వాయిదావేసింది.