ఆంధ్రప్రదేశ్‌

ఇక మున్సిపాల్టీల్లో వేర్వేరుగా తడి పొడి చెత్త సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 13: ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పురపాలక సంఘాల్లో తడి-పొడి చెత్తను వేర్వేరుగా సేకరించనున్నారు. ఇప్పటికే నగరాల్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని పట్టణాల్లో సైతం అమలుచేయనున్నారు. ఈమేరకు పుర పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి బహిరంగ ప్రదేశాల్లో స్వచ్చ్భారత్‌లో భాగంగా తడిపొడి చెత్త సేకరించే ఫ్లెక్సీలను ఏర్పాటుచేస్తున్నారు. కరపత్రాలు, మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రతీ ఇంటిలోని తడి చెత్త సేకరణకు ఆకుపచ్చ రంగు, పొడి చెత్తకు నీలి రంగు డబ్బాలను వినియోగించాలని ఆయా పురపాలక సంఘాల్లోని కమిషనర్లు ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కార్పరేషన్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు 110 ఉన్నాయి. వీటి ద్వారా నిత్యం 6444 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. దీనితో పాటు ఇంటింటికి వెళ్ళి మరో 3183 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తున్నారు. ఇందులో తడి, పొడి చెత్త కలిసే ఉంటుంది. సేకరించిన ఈ చెత్తను ఒకేచోట డంప్‌చేసేవారు. ఇలా ఇంటింటి నుంచి చెత్తను సేకరించడంలో పురపాలక సంఘాలు పూర్తిగా విజయం సాధించాయి. ఇప్పుడు ఆ చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేసి విద్యుత్ ఉత్పత్తిచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు అనుగుణంగా జిల్లాల్లో రెండు నుంచి మూడు వరకు పవర్ ప్రాజెక్టులు ఏర్పాటుచేస్తారు. అయితే విద్యుత్ ప్రాజెక్టులు విజయవంతం కావాలంటే ఎక్కువ అవసరం ఉంటుంది. దీంతో పురపాలక పరిపాలనా విభాగం మున్సిపాల్టీలను క్లస్టర్లుగా విభజన చేసింది. రెండు, మూడు మున్సిపాల్టీలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటుచేసి, అక్కడ లభించే చెత్తను సమీపంలోని పవర్‌ప్రాజెక్టులకు డంప్‌చేస్తారు. కాగా రాష్ట్రంలో కార్పొరేషన్లకు మినహా దాదాపుగా అన్ని పురపాలక సంఘాలకు డంపింగ్ యార్డులులేవు. దీంతో సేకరించిన చెత్తను విద్యుత్ ఉత్పత్తికి మళ్లిస్తే డంపింగ్ సమస్య కూడా తప్పుడుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇక 1997 మున్సిపల్ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా కూడా పోస్టర్లు ఎక్కడ పడితే అక్కడ అతికించడానికి వీలులేదు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో అసలు అతికించరాదు. సినిమాలకు చెందిన పోస్టర్లు అయితే ఆయా థియేటర్లలో మాత్రమే అతికించుకోవాలి. లేదా మున్సిపాల్టీనుంచి అనుమతులు తీసుకున్న హోర్డింగ్‌ల్లో మాత్రమే ఏర్పాటుచేసుకోవాలి.