ఆంధ్రప్రదేశ్‌

నంద్యాలపై బాబు టెలీకాన్ఫరెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 13: మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి రాజీనామాతో కర్నూలు జిల్లా నంద్యాలలో మారిన రాజకీయ సమీకరణలపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షించ నిర్వహించారు. ఆ మేరకు మంత్రి అఖిలప్రియ, జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా పార్టీ నేతలతో బాబు మంగళవారం టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఇంకా ఎవరైనా పార్టీని వీడే అవకాశం ఉందా.. శిల్పా వైదొలగినందున ఆ ప్రభావం మండలాలపై పడే అవకాశం ఉందా అని ఆరా తీశారు. అయితే, ఆయన వెళ్లినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదని, ఇంకా కొత్త నేతలు పార్టీలో చేరనున్నారని అఖిల చెప్పారు. జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డితో కలసి నంద్యాలలో పార్టీ అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపిస్తామని ఆమె బాబుకు భరోసా ఇచ్చారు.