ఆంధ్రప్రదేశ్‌

సోషల్ మీడియాలో అశ్లీలాన్ని అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 13: సాంకేతికత అభివృద్ధి చెందినప్పటికీ వాటి దుష్ప్రభావం వల్ల యువత పెడదోవ పడుతోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఇక్కడ ఆనందగజపతి ఆడిటోరియంలో నిర్వహించిన మహిళా సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడుతూ యువత పెడదోవ పట్టకుండా ఉండేందుకు సోషల్ మీడియాలో అశ్లీలాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు అండగా నిర్భయ లాంటి చట్టాలు ఉన్నా అత్యాచారాలు ఆగడం లేదన్నారు. వీటిని అరికట్టాలంటే అవసరమైతే మహిళలు ఆత్మ రక్షణ కోసం ఆడపులి మాదిరిగా ఎదురు తిరగాల్సిన అవసరం ఉందన్నారు. ఆడపిల్లలు అసమర్థులుగా ఉండకూడదన్నారు. మహిళల్లో ధైర్యం నింపాలన్నారు. ఇందుకు మహిళల్లో చట్టాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. దాంతోపాటు సమాజంలో మార్పు రావాలన్నారు. పిల్లల పెంపకంలో కూడా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు. నేడు ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై బంధాలు, బంధుత్వాలకు ప్రాధాన్యత తగ్గిపోయిందన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారన్నారు. ఆడపిల్లలు పాఠశాలకు వెళ్తే తిరిగి వచ్చే వరకు అనుక్షణం వారిని కంటికి రెప్పలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. మన జీవితం మన చేతుల్లోనే ఉందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. నేడు కొన్ని టెలివిజన్ సీరియళ్లు మహిళలను నేరప్రవృత్తికి ప్రేరేపించే విధంగా ఉన్నాయన్నారు. వాటిని అరికట్టాలన్నారు. మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి తాను ప్రతి జిల్లాలోనూ పర్యటించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి, జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. సదస్సులో మాట్లాడుతున్న మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి