ఆంధ్రప్రదేశ్‌

మోదీ నాయకత్వంలో దేశం ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 13: గడచిన మూడు సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో పయనిస్తోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి సుజనాచౌదరి అన్నారు. సామాన్య ప్రజల జీవితాల్లో వికాసాత్మకమైన, గణనీయమైన మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని రంగరాయ వైద్య కళాశాలలో మంగళవారం విశాఖపట్నం పోర్ట్‌ట్రస్ట్, ప్రభుత్వ యంత్రాంగం సంయుక్తంగా ‘అందరితో కలిసి అందరి అభివృద్ధి’ సమ్మేళన్ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుజనాచౌదరి మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలన్న ఆశయంతో పలు సంక్షేమ కార్యక్రమాలను మోదీ ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు. గడచిన మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 102 కార్యక్రమాలు దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తున్నాయని పేర్కొన్నారు. 28కోట్ల ప్రజలకు జన్‌ధన్ పథకం కింద బ్యాంకు ఖాతాలు తెరచి, దేశాన్ని ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. అటల్ పింఛన్ యోజన కింద దేశంలో 13కోట్ల మంది ప్రజలకు సామాజిక భద్రత కల్పించారన్నారు. ముద్ర యోజన కింద ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత కల్పిస్తూ సుమారు 7కోట్ల 50 లక్షల మంది చిరు వ్యాపారులకు ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా రుణాలు కల్పించిన ఘనత కేంద్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో సర్వం కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందన్నారు. ఉన్నత ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అహరహం కృషి చేస్తోందన్నారు. సభకు కాకినాడ ఎంపి తోట నరసింహం అధ్యక్షత వహించారు. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, అరకు ఎంపి కొత్తపల్లి గీత, విశాఖ పోర్టు ట్రస్ట్ ఛైర్మన్ ఎంటి కృష్ణబాబు, ఎమ్మెల్సీలు రాము సూర్యారావు పాల్గొన్నారు.
చిత్రం.. ‘అందరితో కలిసి అందరి అభివృద్ధి’ సమ్మేళన్‌లో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి సుజనాచౌదరి