ఆంధ్రప్రదేశ్‌

ఇద్దరు బిడ్డలు సహా తల్లి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, జూన్ 14 : తన ఇద్దరు బిడ్డలు సహా బావిలోకి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని జముకుల దినె్న గ్రామంలో బుధవారం జరిగింది. జముకుల దినె్న గ్రామానికి చెందిన నరసింహారావు కుమార్తె పద్మ (25)ను తాళ్లూరు మండలం గంగవరం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. ఇటీవల తన పుట్టింటికి వచ్చిన పద్మ గత రెండు రోజుల నుండి బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు సమీపంలోని బావి వద్దకు తచ్చాడుతున్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. గత రెండు రోజుల నుండి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో గ్రామస్థులు ఎవరో ఒకరు కనిపించడంతో ఆమె ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. బుధవారం ఎవ్వరూ లేని సమయంలో తన కుమార్తె సాహితి (8) , కుమారుడు సంజయ్ (4)లను ముందుగా బావిలోకి తోసేసి, ఆ తరువాత తానుకూడా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు కుమార్తె సాహితి ప్రాణాలతో బయటపడింది. కుమారుడు సంజయ్, పద్మ బావిలోనే ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన విషయాన్ని తెలుసుకున్న దర్శి డిఎస్‌పి వి శ్రీరాంబాబు, సిఐ కెవి రాఘవేంద్ర, ఎస్‌ఐ సుబ్రమణ్యం సంఘటనా స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలను పరిశీలించారు. శవాలను పంచనామా నిమిత్తం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.