ఆంధ్రప్రదేశ్‌

రూ.80 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, జూన్ 14: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సమీపంలోని రోలుగుంట నుంచి హైదరాబాద్‌కు వ్యానులో రహస్యంగా తరలిస్తున్న రూ.80 లక్షల విలువైన గంజాయిని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు బుధవారం స్వాధీనంచేసుకున్నారు. వ్యానులో ప్లాస్టిక్ కూరగాయల ట్రేల అడుగున ఉంచిన బస్తాల్లో రహస్యంగా తరలిస్తుండగా ముందస్తుగా వచ్చిన సమాచారం మేరకు దేవరపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. కొవ్వూరు ఇన్‌చార్జి డిఎస్పీ జె వెంకట్రావు దేవరపల్లి పోలీసుస్టేషనులో బుధవారం విలేఖర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రోలుగుంట నుండి హైదరాబాద్ సమీపంలోని జహీరాబాద్‌కు వ్యానులో గంజాయి తరలిస్తున్నట్టు సమాచారం అందిందన్నారు. ఈమేరకు తనిఖీలు చేపట్టిన దేవరపల్లి పోలీసులు వ్యానులో రహస్యంగా తరలిస్తున్న గంజాయిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారన్నారు. ఒక్కొక్కటి 2.6 కిలోలు బరువు కలిగిన 308 గంజాయి ప్యాకెట్లను (900 కిలోలు) స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ సుమారు 80 లక్షల రూపాయలుంటుందని చెప్పారు. గంజాయి రవాణా చేస్తున్న అనకాపల్లి మండలం శంకరం గ్రామానికి చెందిన పిల్లా శ్రీను, చరగడం సాయి, విశాఖ జిల్లా గొలుగొండ సమీపంలో పాకలపాడుకు చెందిన కోనాల నూకరాజును అరెస్టుచేసినట్టు చెప్పారు. దీనికి ప్రధాన సూత్రధారి అనకాపల్లికి చెందిన శివ అన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి కొవ్వూరు రూరల్ సిఐ శరత్ రాజకుమార్ దర్యాప్తు చేస్తున్నట్టు డిఎస్పీ చెప్పారు. ఈ సందర్భంగా వ్యానును పట్టుకున్న దేవరపల్లి ఎస్సై పి వాసును డిఎస్పీ వెంకట్రావు అభినందించారు.