ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో 16 ప్రైవేట్ బస్సులు సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: రాష్టవ్య్రాప్తంగా రిజిస్ట్రేషన్లు లేకుండా తిరుగుతున్న 16 ప్రైవేట్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. ఆలిండియా పర్మిట్లు కలిగిన 900 కాంట్రాక్ట్ క్యారేజీ ప్రైవేట్ బస్సుల రిజిస్ట్రేషన్‌లను అరుణాచలప్రదేశ్ రద్దుచేసిన నేపథ్యంలో ఆ బస్సులు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా తిరగకుండా నిలుపుదల చేసేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అరుణాచల ప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు రద్దు బస్సుల వివరాలను రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం 13 జిల్లా అధికారులకు పంపించారు. దీంతో వీరంతా బుధవారం తెల్లవారుజామున తమ తమ జిల్లాల్లోని చెక్ పోస్టుల వద్ద మాటు వేశారు. మొత్తంపై 16 ప్రైవేట్ బస్సులను సీజ్ చేసి వాటిపై కేసులు నమోదు చేశారు. వీటిల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో మార్నింగ్ స్టార్‌కు చెందిన మూడు, కోమిట్ల ట్రావెల్స్‌కు చెందిన మూడు మొత్తం ఆరు బస్సులను సీజ్ చేశారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో కోమిట్ల ట్రావెల్స్ 2, మార్నింగ్ స్టార్, హెచ్‌పి ట్రావెల్స్, ప్రవీణా ట్రావెల్స్‌కు చెందిన ఒక్కొక్క బస్సు మొత్తం ఐదు బస్సులను సీజ్ చేశారు. చిత్తూరు జిల్లాలో మనిషా ట్రావెల్స్, కోమిట్ల ట్రావెల్స్ ఒక్క బస్సు, కృష్ణాలో కోమిట్ల ట్రావెల్స్, కర్నూలు జిల్లాలో కల్లాడ ట్రావెల్స్, అనంతపురం జిల్లాలో మనిషా ట్రావెల్స్ బస్సు ఒకటి సీజ్ చేశారు. ఇదిలా ఉండగా ఆలిండియా పర్మిట్ కల్గిన వందలాది ఎసి స్లీపర్ బస్సుల రిజిస్ట్రేషన్‌లు రద్దు కావడంతో ప్రయాణికుల సౌకర్యార్థం ఎపిఎస్ ఆర్టీసీ మరిన్ని ఎసి స్లీపర్ బస్సులను రోడ్డెక్కిస్తున్నదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.మాలకొండయ్య చెప్పారు.