ఆంధ్రప్రదేశ్‌

ఏసిబికి చిక్కిన అవినీతి అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు/యర్రగొండపాలెం, జూన్ 14: అవినీతి రుచి మరిగిన ముగ్గురు ఇంజనీరింగ్ అధికారులు ఏసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నెల్లూరు నగరంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో బుధవారం సాయంత్రం 6.30గంటలకు చిత్తూరు జిల్లా ఏర్పేడుకు చెందిన శాఖమూరి సుందరనాయుడు కాంట్రాక్టర్‌కు నీరుచెట్టుకు సంబంధించిన బిల్లు చెల్లించడానికి క్వాలిటీ కంట్రోల్ ధ్రువీకరణ పత్రం కావాల్సి ఉండగా దాన్ని ఇవ్వడానికి ఒకశాతం లంచం డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ ఎసిబి అధికారులను ఆశ్రయించడంతో పథకం ప్రకారం నెల్లూరు క్వాలిటీ కంట్రోల్ విభాగానికి చెందిన సహాయక ఇంజనీర్లు చంద్రవౌళి, రాజా గిరిధర్ లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఇదిలావుండగా ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెంలో లంచం తీసుకుంటూ ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ లక్ష్మణ్‌నాయక్ ఎసిబి అధికారులకు చిక్కారు. పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామానికి చెందిన వెన్నా వెంకటరెడ్డి గ్రామంలో వేసిన బోర్లకు బిల్లులు చెల్లించడానికి మూడు శాతం కమిషన్ డిమాండ్‌చేయడంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ లక్ష్మణ్‌నాయక్‌కు లంచం ఇస్తుండగా వలపన్ని పట్టుకున్నారు.