ఆంధ్రప్రదేశ్‌

పాఠశాల తొలగించడంపై హైకోర్టులో సర్పంచ్ పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుబోలు, జూన్ 14:తమ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్న 6.7తరగతులు తొలగించడంపై ఒక గ్రామ సర్పంచ్ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట సర్పంచ్ ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పిటిషనర్ కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక అవసరాలైన విద్య , వైద్యాన్ని ఆర్ధిక కోణంలో వ్యాపార దృక్పథంతో చూడరాదంటూ హైకోర్టుకు విన్నవించినట్లు తెలిపారు. తమ గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో 6,7తరగతులను రేషనైలేజషన్ పేరుతో ప్రభుత్వం తొలగించడంపై హైకోర్టు ఆశ్రయించానన్నారు. ఈకేసులో వాదనలు విన్న కోర్టు సోమవారం డిఈఓ సోమవారం వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించిందన్నారు. సోమవారం వాదనలు విన్న తర్వాత తీర్పు ఇస్తామని కోర్టు తెలిపిందన్నారు. సర్పంచ్‌గా నా భాధ్యతను నేను నిర్వర్తిస్తున్నానని, ఫలితం మా పాఠశాల విద్యార్థులకు అనుకూలంగా వస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు.