ఆంధ్రప్రదేశ్‌

కృష్ణా డెల్టాకు ‘వంద’నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 14: అఖండ గోదావరి కుడి గట్టుపై పట్టిసీమ వద్ద నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది నుంచి 100 టిఎంసిల నీటిని తోడటానికి రంగం సిద్ధమవుతోంది. గోదావరిలో కనీస మట్టం 14 మీటర్లు ఉంటేనే నీటిని తోడాలని జీవో వుంది. అయితే పట్టిసీమ వద్ద 12.5 మీటర్ల మట్టంలో కూడా నీటిని తోడే విధంగా ఈ పంప్ హౌస్‌ను డిజైన్ చేశారని తెలుస్తోంది. దీనిని బట్టి ముందు నుంచే 100టిఎంసిల ఆలోచన వుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. కాటన్ బ్యారేజి పాండ్ లెవెల్ 13.67 మీటర్లు. పట్టిసీమ వద్ద 12.5 మీటర్ల మట్టంలో ఎత్తిపోతలు నడిస్తే గోదావరి డెల్టాలకు నీరందని స్థితి ఎదురవుతుందని నీటిపారుదల రంగ నిపుణులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో బ్యారేజి వద్ద పాండ్ లెవెల్ తగ్గకుండా రబీ సీజన్‌లో సైతం నీటిని పట్టిసీమ ద్వారా తోడాలంటే సీలేరు నుంచి విధిగా నీటిని గోదావరి నదికి చేరేలా చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పట్టిసీమ లిఫ్ట్ డిజైన్ ప్రకారం 12.5 మీటర్లు కనీస మట్టం వున్నపుడు కూడా నీటిని తోడేందుకు అనుకూలంగానే ముం దస్తు ఆలోచనతోనే నిర్మించినట్టు తెలుస్తోంది. గోదావరి కనీస నీటిమట్టం 12.5 మీటర్ల నుంచి పోలవరం కుడి కాల్వలో 42.5 మీటర్ల ఎత్తు వద్దకు నీటిని లిఫ్ట్ చేస్తారు. అయితే జిఒలో మాత్రం లిఫ్ట్ వద్ద 14 మీటర్ల మట్టం ఉన్నపుడే తోడుకోవాలని ఉంది. అటువంటపుడు 100 టిఎంసిలు ఏ విధంగా పట్టుకెళ్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బ్యారేజి పాండ్ లెవెల్ 13.67 మీటర్ల కంటే దిగువన గోదావరిలో 12.5 మీటర్ల నీటి మట్టం వద్ద నీటిని లిఫ్ట్ చేస్తే బ్యారేజి వద్ద నీటి మట్టం పడిపోతుందంటున్నారు. అయినా గోదావరి మట్టాలను పరిగణనలోకి తీసుకోకుండా 100 టిఎంసిలు తరలింపునకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. విధి విధానాలు ఎప్పటికపుడు మార్చుకునే వెసులుబాటు జిఓ 200లో ఉండటంతోనే ఇపుడు 100 టిఎంసిలు పట్టుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
గోదావరి నదిలో ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నపుడు ఎంత తోడుకున్నా ఫర్వాలేదు గానీ, నీటి లభ్యత అంతంత మాత్రంగా ఉన్నపుడు లిఫ్ట్ వాడితేనే డెల్టాలో రబీ సమయంలోనే ఇబ్బంది ఎదురవుతుందంటున్నారు.
నదిలో నీరు ఎక్కువగా ఉందని చెప్పడానికే వేసవిలో సైతం కాటన్ బ్యారేజీ నుండి వృథాగా జలాల పేరుతో సముద్రంలోకి నీరు వదిలేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. దీన్ని సాకుగాచెప్పి, వంద టిఎంసిలు తరలించేస్తారని గోదావరి డెల్టా ప్రాంత నిపుణులు పేర్కొంటున్నారు. కృష్ణా డెల్టాపై ప్రభుత్వం కనపరుస్తున్న శ్రద్ధ గోదావరి డెల్టాల భవిష్యత్తుపై కనిపించడంలేదనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో పోలవరం ప్రాజెక్టు పేరిట రెండో చాప్టర్‌లో 7(ఇ) క్లాజ్‌లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం అనుమతి వచ్చి న వెంటనే కుడి కాల్వకు నీటిని ఎపుడు మళ్లిస్తారనే అంశంతో నిమి త్తం లేకుండా కృష్ణా జలాల్లో ఎపికి ఉన్న 35 టిఎంసిల నీటిని వాడుకునే స్వేచ్ఛ కర్నాటక, మహారాష్టక్రు ఉంటుందని పేర్కొన్నారు. 7(ఎఫ్)లో 80 టిఎంసిల కంటే ఎక్కువ కుడి కాల్వకు మళ్లిస్తే ఆ నీటిలోనూ ఎగువ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని కూడా పేర్కొనివుంది. ఇలాంటి పరిస్థితుల్లో కుడి కాలువ ద్వారా 100 టిఎంసిల నీటిని ఎలా తరలిస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 80 టిఎంసిలకు మించి తరలించడం బచావత్ ప్రకారం కుదురుతుందా, 100 టిఎంసిలు పట్టుకెళితే కృష్ణా జలాల్లో వాటా ఇవ్వక తప్పదు అని నిపుణులు పేర్కొంటున్నారు. లిఫ్ట్ ద్వారా అదనంగా తీసుకెళ్తే రాష్ట్ర జల హక్కులకు భంగకరమేనని అంటున్నారు.