ఆంధ్రప్రదేశ్‌

ఇ-వేలంలో అగ్రి, అక్షయగోల్డ్ ఆస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 16: అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ ఆస్తుల ఇ-వేలం ప్రక్రియ కొనసాగుతోందని, హైకోర్టు ఆదేశాలతో ముందుకెళ్తున్నట్లు సిఐడి అదనపు డిజిపి ద్వారకా తిరుమలరావు తెలిపారు. కాగా అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఛాంబర్ వాటర్ లీకేజీ తేలాల్సి ఉందని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని చెప్పారు. విజయవాడలోని డిజిపి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ ఆస్తుల వేలానికి సంబంధించి ఇప్పటికే పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామన్నారు. అగ్రిగోల్డ్ కేసులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ విలువ ప్రకారం మొత్తం 2,700కోట్ల ఆస్తులు వేలానికి గుర్తించామని, ప్రస్తుతం 70కోట్ల రూపాయలు విలువైన ఆస్తులకు ఇ-వేలం నిర్వహిస్తున్నామన్నారు. విజయవాడ-5, నూజివీడు-2, ప్రకాశం-2, కర్నూలు-2, నెల్లూరు-1 మొత్తం 12చోట్ల ఆస్తులను వేలం ప్రకటించామన్నారు. ఈనెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఇ-బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చన్నారు. అదేవిధంగా అక్షయ గోల్డ్‌కు సంబంధించి విజయనగరం, అనంతపురం, ప్రకాశం, కర్నూలు, విశాఖ తదితర చోట్ల గుర్తించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ విలువ ప్రకారం 10కోట్ల రూపాయలు విలువైన ఆస్తులకు సంబంధించి ఈనెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఇ-బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చన్నారు. ఈ రెండు సంస్థ ఆస్తులకు సంబంధించి ఇ-వేలంలో పాల్గొనేవారు ‘కొనుగోలు.ఏపి.జిఓవి.ఇన్’ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
జగన్ చాంబర్‌లో లీకేజిపై కొనసాగుతున్న దర్యాప్తు
ఇదిలావుండగా అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఛాంబర్ లీకేజీ కేసును ప్రస్తావించగా ఆయన స్పందిస్తూ దర్యాప్తు కొనసాగుతోందని, తేలాల్సి ఉందన్నారు. పైపు జాయింట్ కట్ అయినందున నీరు నేరుగా లోపలికి వచ్చినట్లు గుర్తించామన్నారు. దీనిపై కాకినాడ జెన్‌టియు ప్రొఫెసర్ల బృందం కూడా వచ్చి పరిశీలించిందని, అయితే పైప్ కటింగ్ వెనుక కారణాలను అనే్వషిస్తున్నట్లు తెలిపారు. అది ఎలా జరిగిందనేది త్వరలో తేలుస్తామని, కేవలం పైపు లేకేజీ ద్వారా మాత్రమే నీరు వచ్చినట్లు గుర్తించామని, అంతేగాని అసెంబ్లీ నిర్మాణ లోపం లేదన్నారు.