ఆంధ్రప్రదేశ్‌

పరువు పోయాక పోస్టుమార్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 16: నంద్యాల రాజకీయాలపై పార్టీ అధినేత చంద్రబాబు స్పందిస్తున్న తీరు చేతులు కాలాక... అన్న చందంగా ఉందని పార్టీ కేడర్ అసహనం వ్యక్తం చేస్తోంది. నంద్యాల నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి శిల్పా మోహనరెడ్డి వైకాపాలో చేరిన తరువాత అధినేత చంద్రబాబు నంద్యాల రాజకీయాలపై స్పందించడాన్ని టిడిపి నాయకులు, కార్యకర్తలు తప్పుబడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై గత మూడు నెలల నుంచి చెలరేగుతున్న వివాదానికి తెర దించడంలో బాబు విఫలమయ్యారని బాహాటంగానే ఆరోపిస్తున్నారు. భూమా మరణించిన నాటి నుంచి శిల్పా మోహనరెడ్డి తనకు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేయడాన్ని కూడా వారు తప్పు పడుతున్నారు. మరణించిన వ్యక్తి కుటుంబం నుంచి మరొకరికి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించడాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఆనవాయితీగా పాటిస్తున్న విషయం ఆయన గుర్తుంచుకోవాల్సిందని వారంటున్నారు.
అయితే ఆయన డిమాండ్‌పై చంద్రబాబు మొదట్లోనే తన అభిప్రాయాన్ని స్పష్టం చేసి ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదని అభిప్రాయపడుతున్నారు. భూమా మృతితో ఖాలీ అయిన నంద్యాల స్థానంలో వారి కుటుంబం నుంచే అభ్యర్థిని నిలపాలని చంద్రబాబు భావిస్తే ఆ విషయాన్ని శిల్పాకు స్పష్టం చేసి నిర్ణయాన్ని ఆయనకే వదిలేసి ఉంటే పార్టీ ఇప్పుడు పడుతున్న ఇబ్బంది ఉండేది కాదని వారంటున్నారు. ఒక వేళ భూమా కుటుంబంలో ఇవ్వడానికి సమస్య ఉంటే ఆ విషయం మంత్రి అఖిలప్రియకు చెప్పి సముదాయించాల్సిందని వారంటున్నారు.
ఇవేమీ చేయకుండా అభ్యర్థిని తాను నిర్ణయిస్తానని వేచి ఉండమంటూ కాలయాపన చేయడం వల్ల శిల్పా మరో దారి ఎంచుకున్నారని, దీంతో నంద్యాలలో పార్టీ ఇరకాటంలో పడిందని వాపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు వ్యవహరిస్తున్నట్లుగా మొదట్లోనే చేసిఉంటే ఈ రకమైన సమస్య తలెత్తేది కాదని వారు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనైనా నాయకుల మధ్య విబేధాలు పరిష్కరించడం ఆయనకు సాధ్యమయ్యేది కాదని, ఎవరినో ఒకరికి పార్టీ బాధ్యతలు అప్పగించి ఆ విషయాన్ని ఇతర నేతలకు వెల్లడించి పార్టీలో క్రమశిక్షణతో లేని వారిని బయటకు పంపితే ఉన్న నాయకులు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని వారంటున్నారు. రెండు వర్గాలను పెంచి పోషిస్తే ఏదో ఒకనాడు పార్టీని ఇబ్బందుల్లో పెట్టి ఎవరో ఒకరు మరో దారి చూసుకోవడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చొరవ తీసుకుని విబేధాలు ఉన్న నియోజకవర్గ నేతలతో చర్చించి తన నిర్ణయాన్ని వెల్లడించి పార్టీని రానున్న సాధారణ ఎన్నికలకు సిద్ధం చేయాలని కోరుతున్నారు.