ఆంధ్రప్రదేశ్‌

పొదలకూరులో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదలకూరు, జూన్ 16: పోలీస్ 30వ యాక్ట్ అమలులో ఉండగా, ర్యాలీకి ప్రయత్నించారని నెల్లూరు జిల్లా పొదలకూరు మండల పరిషత్ అధ్యక్షులు కోనం బ్రహ్మయ్య, సర్పంచ్ తెనాలి నిర్మల సహా ఏభై మంది వైఎస్‌ఆర్‌సి కార్యకర్తలు, నాయకులను శుక్రవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పట్టణంలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. పొదలకూరు మండలంలో జరిగిన అభివృద్ధి మాటున అవినీతిపై చర్చకు రావాలంటూ వైఎస్‌ఆర్‌సి నేతలు విసిరిన సవాళ్లతో టిడిపి నేతలు ప్రతి సవాళ్లు విసిరారు. శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో పంచాయతీ కార్యాలయం వద్దకు దమ్ముంటే చర్చకు రావాలంటూ వైఎస్‌ఆర్‌సి నేతలు పిలుపునిచ్చారు. దీంతో టిడిపి నేతలు తమ పార్టీ కార్యాలయం వద్దకు, వైఎస్‌ఆర్‌సి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పోలీసులు ఇరు స్థావరాల వద్ద మొహరించారు. ఆత్మకూరు డిఎస్పీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పొదలకూరు సిఐ శివరామకృష్ణారెడ్డి, పొదలకూరు, చేజర్ల, కలువాయి ఎస్సైలు పోలీసులతో భారీ బందోబస్తు చేపట్టారు. టిడిపి కార్యాలయంలో లోపల ఉండే నాయకులు ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. వైఎస్‌ఆర్‌సి నాయకులు పంచాయతీ కార్యాలయం వద్ద నుంచి బ్యానర్లను చేతపట్టి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తిస్తూ కొంతదూరం వెలుపలకు వచ్చారు.