ఆంధ్రప్రదేశ్‌

కోస్తాలో విస్తారంగా వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 16: నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో కోస్తాలో మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. కోస్తాలో ఒక మోస్తరు నుంచి ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే ఉత్తర కోస్తా తీరం వెంబడి నైరుతి దిశగా గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.