ఆంధ్రప్రదేశ్‌

1957 టన్నులు ఎర్రచందనం వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, జూన్ 16: రాష్ట్రంలో వివిధ గొడౌన్లలో ఉన్న ఎర్రచందనం విక్రయానికి మూడు దశల్లో గ్లోబల్ టెండర్లను పిలువనున్నట్లు రాష్ట్ర అటవీశాఖామంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంటలోని సిడబ్ల్యూసి ఎర్రచందనం గోడౌన్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 1957 టన్నుల ఎర్రచందనం దుంగలను మూడు దశల్లో గ్లోబల్ టెంటర్లకు నోటిఫికేషన్ జారీ చేయనున్నామని, మొదటిదశలో ఈనెల 26,27 తేదీలలో, రెండోదశలో ఆగస్టు 2,3, మూడవదశలో 9,10న వేలం జరుపుతామని అన్నారు. గోడౌన్‌లలో నిల్వ ఉన్న దుంగల్ని మూడు కేటగిరీలుగా విభజించి నాణ్యతా కొలతలు, బరువు పరంగా కొనుగోలుదారులు చూసుకునేవిధంగా అందుబాటులో ఉంచుతామన్నారు. అలాగే ప్రీ బీడ్ ఫిట్టింగ్‌లను ఆగస్టు నెల 4 నుంచి 12 వరకు తిరుపతి, అమరావతి, హైదరాబాద్ ప్రాంతాల్లో కొనుగోలుదారులతో సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. ఈనెల 26 నుంచి 30 వరకు చైనా దేశంలో కూడా ఏర్పాటుచేయనున్నామన్నారు.