ఆంధ్రప్రదేశ్‌

రాజధానిలో కూలీలలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 1: హైదరాబాద్ నుంచి రాజధానికి ఉద్యోగులు తరలి రానున్నారు. వారు నివాసం ఉండేందుకు కావల్సిన ఇళ్ళను నిర్మించేపనిలో పడ్డారు రైతులు. ఈ ఇళ్ళు నిర్మించాలంటే కూలీలు కావాలి కదా! అసలు సమస్య ఇక్కడే మొదలైంది. వందల సంఖ్యలో అపార్ట్‌మెంట్లు తయారవుతున్నాయి. వీటికి వేల సంఖ్యలో కూలీల అవసరం ఉంది. ఉన్న ఊళ్ళో తాపీ మేస్ర్తీ పని చేసేవారితో కథ నడిపిద్దాం అని రైతులు అనుకున్నారు. అయితే, వారు హ్యాండిచ్చారు. రోజంతా కష్టపడినా 500 రూపాయలు రావడం లేదు. రాజధానిలో ప్రభుత్వపరంగా జరుగుతున్న నిర్మాణ పనుల్లో చిన్న చిన్న కాంట్రాక్ట్‌లు తీసుకుంటే లైఫ్ సెటిలైపోతుందని భావించిన ఈ పనివాళ్ళంతా బడా కాంట్రాక్టర్ల చెంత చేరిపోయారు. సెక్రటేరియట్ నిర్మాణానికి కృష్ణా నది నుంచి ఇసుక తరలించే కాంట్రాక్ట్, అలాగే మరికొన్ని కాంట్రాక్ట్ పనులు ఒప్పుకున్నారు. ఉదయం రంగంలోకి దిగితే, సాయంత్రానికి వెయ్యి రూపాయలు కళ్ళ చూస్తున్నారు. దీంతో లోకల్ కూలీలను నమ్ముకుని అపార్ట్‌మెంట్లు మొదలుపెట్టిన రైతులు డైలమాలో పడ్డారు. ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. మందడం గ్రామంలో ఒక రైతు గత ఏడాది జూన్‌లో జి ప్లస్ 4 అపార్ట్‌మెంట్ మొదలుపెట్టాడు. కూలీలు దొరక్కపోవడం వలన మధ్యలో పని నిలిచిపోయింది. ఇదే పరిస్థితి అమరావతి ప్రాంతంలోనూ ఉంది. దీంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి తాపీ మేస్ర్తిలను, కూలీలను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టారు. ఒక్కో పనిడికి 25 వేల నుంచి 30 రూపాయలు అడ్వాన్స్ ముట్ట చెబుతున్నారు. అలాగే ఉత్తరాంధ్రలో మేస్ర్తీకి రోజుకు 400 నుంచి 450 రూపాయలు ఇచ్చేవారు. అదే ఇక్కడ 600 రూపాయలు ఇవ్వాల్సి వస్తోంది. అలాగే మగ కార్మికునికి 500 రూపాయలు, ఇసుక, ఇటుక మోసే మహిళకు 450 రూపాయలు ఇవ్వాల్సి వస్తోంది.
ఇదిలా ఉండగా భారీగా అడ్వాన్స్‌లు తీసుకుని, ఒకే ఊరి నుంచి వచ్చే కార్మికులు కొద్ది రోజులు ఇక్కడ పనిచేసి, ఒక్కరొక్కరుగా జారుకుంటున్నారు. దీంతో ఆ రైతు లబోదిబో అంటున్నాడు. వీళ్ళతో పనిచేయించడం కన్నా, ఎక్కడి పనులు అక్కడ ఆపేసుకోవడమే బెటర్ అంటున్నారు రైతులు.