ఆంధ్రప్రదేశ్‌

నాని అమ్మిన బస్సుల కొలతల్లోనూ తేడాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 17: విజయవాడ ఎంపి కేశినేని నాని అమ్మిన బస్సుల కొలతల్లో తేడాలున్నాయని ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల సంఘం ఉపాధ్యక్షుడు సునీల్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రైవేట్ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు శనివారం కలిసి తమ సమస్యలను వివరించారు. అనంతరం మీడియాతో సునీల్ రెడ్డి మాట్లాడుతూ ట్రావెల్స్ బస్సు వ్యాపారంలో నాని అనుసరించిన అన్ని విధానాలనే తామూ అనుసరించామని వ్యాఖ్యానించారు. ఇందులో మంచివి, చెడువి కూడా ఉన్నాయన్నారు. ట్రావెల్స్ వ్యాపారంలో అనుభవం ఉన్న కేశినేని వ్యాపారం నుంచి బయటకు వెళ్లి ఇలా చేయడం సరికాదన్నారు. బస్సుల ఓవర్‌హ్యాంగ్ (నిర్దేశిత ఛాసిస్ పొడవు కన్నా ఎక్కువ ఉండటం) సమస్య ఆరెంజ్ బస్సులకే పరిమితం కాదని స్పష్టం చేశారు. ఆర్టీసీ సహా అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకూ ఓవర్ హ్యాంగ్ ఉందన్నారు. అనుమతించిన బస్ పొడవు కంటే 0.6 మీటర్ల మేర ఎక్కువగా ఓవర్‌హ్యాంగ్ ఉందన్నారు. కేశినేని ట్రావెల్స్ బస్సులకు ఓవర్ హ్యాంగ్ ఉండటం తప్పు కానప్పుడు, మిగిలిన బస్సులకు ఇది సమస్య ఎందుకు అవుతుందని ప్రశ్నించారు. కేశినేని ట్రావెల్స్‌కు చెందిన ఓవర్‌హ్యాంగ్ ఉన్న 27 బస్సుల వివరాలను ఆయన వెల్లడించారు. రాష్ట్రం వెలుపల రిజిస్టర్ అయిన బస్సులను నడపడం నిబంధనల ఉల్లంఘన కాదని తెలిపారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో బస్సులను రిజిస్టర్ చేసుకుని పన్ను ఎగవేతకు పాల్పడుతున్నామన్న వాదన సరికాదన్నారు. మూడు నెలలకు ఒక సీటుకు 3750 రూపాయల పన్ను చెల్లిస్తున్నామన్నారు. సిఎం దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లామన్నారు. తాము బస్సులు నడపడటంలో ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడటం లేదని తెలిపినట్టు చెప్పారు. ప్రైవేట్ బస్సుల వ్యవహారంలో కొంత ఉదారంగా వ్యవహరించాలని కోరినట్టు తెలిపారు. 900 బస్సులను నిలిపివేయడం వల్ల 7000 మంది ఉపాధి ఇబ్బందుల్లో పడిందని తెలిపారు. ఈ వ్యవహారంపై కోర్టు స్టే ఇచ్చిందని గుర్తు చేశారు.
రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ సౌకర్యం లేకపోవడం వల్లే ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ చేయిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో స్లీపర్ బస్సులను 2 ప్లస్ 1 సీటింగ్ విధానంలో రిజిస్టర్ చేసుకునే వీలు కల్పిస్తే, రాష్ట్రంలోనే రిజిస్టర్ చేసుకుంటామని తెలిపారు.