ఆంధ్రప్రదేశ్‌

ఆదృశ్యమైన బాలికల ఆచూకీ లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 18: విజయవాడలోని పవిత్రాత్మ నికేతన్ ఆశ్రమం నుంచి అదృశ్యమైన ఇద్దరు బాలికల ఆచూకీ లభ్యమైంది. ఇద్దరినీ కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని బంధువుల ఇంటి వద్ద గుర్తించినట్లు డిసిపిలు జి పాలరాజు, క్రాంతిరాణా టాటా తెలిపారు. నగరంలోని గురునానక్ కాలనీలోని పవిత్రాత్మ నికేతన్ ఆశ్రమంలో ఉంటున్న రోహిణి, మరియమ్మ ఈ నెల 16న అదృశ్యమైనట్లు ఆశ్రమం నిర్వహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, వెంటనే ఐదు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన అనాథ రోహిణి, కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన మరియమ్మ కొంతకాలంగా ఆశ్రమంలో ఉంటూ చదువుకుంటున్నారు. చాలాకాలంగా నాలుగుగోడల మధ్య ఉంటున్న వీరు బాహ్య ప్రపంచాన్ని చూడాలనే ఉద్దేశ్యంతో స్నేహితుల వద్ద కొంత డబ్బు తీసుకుని 15న రాత్రి ఆశ్రమం నుంచి బయటకు వచ్చారు. ఆటో ఎక్కి నేరుగా బావాజీపేటలో దిగి మరో ఆటో ఎక్కి బస్టాండుకు వెళ్లి మచిలీపట్నం వెళ్ళే బస్సెక్కారు. చీకటి పడిపోవడంతో బస్సులో ఓ మహిళ గమనించి ఇద్దరినీ తన ఇంటికి తీసుకెళ్లి ఆ రాత్రి ఉంచుకుని మరుసటి రోజు ఉదయం కొంత డబ్బు ఇచ్చి మచిలీపట్నం బస్సు ఎక్కించింది. మచిలీపట్నం వెళ్లిన బాలికలిద్దరూ మరియమ్మ బాబాయి అయ్యప్ప వద్దకు వెళ్లారు. దర్యాప్తు చేపట్టిన ఐదు బృందాలు ఆరా తీసి కొందరు ఆటోడ్రైవర్ల సాయంతో ఎట్టేకేలకు బాలికలను గుర్తించినట్లు చెప్పారు. క్షేమంగా వారిని తిరిగి ఆశ్రమానికి అప్పగించడం ద్వారా కథ సుఖాంతమైందన్నారు.