ఆంధ్రప్రదేశ్‌

కొన్ని వస్తువులపై జిఎస్టీ తగ్గింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 18: రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కొన్ని వస్తువులపై జిఎస్టీని తగ్గిస్తూ జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఢిల్లీలో ఆదివారం జిఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగిన సందర్భంగా గతంలో కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చిన భారీ వడ్డింపు అంశాలను ఆయన ప్రస్తావించారు. జిఎస్టీ అమలు నేపథ్యంలో సామాన్యుడిపై భారం మోపకూడదని, వ్యాపార వర్గాలపై వేధింపులు లేకుండా చూడటం, పన్ను చెల్లింపుల విధానం సులభతరంగా ఉండాలని తమ ప్రభుత్వం భావిస్తున్నట్లు యనమల తెలిపారు. ఇప్పటివరకూ జరిగిన 17 జిఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో ఈ మూడు అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ తమ వాదనలను వినిపించామని మంత్రి తెలిపారు. ఆహార ధాన్యాలకు పూర్తిగా పన్ను నుంచి మినహాయింపు ఇచ్చామని, దీనివల్ల దాదాపు 1000 కోట్ల రూపాయల మేరకు ఖజానాకు నష్టం జరుగుతున్నా సామాన్యులను దృష్టి లో తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు. అగర్‌బత్తీ, బయోగ్యాస్, జీడిపప్పుపై ముందుగా ప్రతిపాదించిన 12 శాతం జిఎస్టీని 5 శాతానికి తగ్గించారని తెలిపారు. టికెట్ ధర 100 రూపాయల కన్నా తక్కువ ఉన్న సినిమాలకు పన్నును 28 నుంచి 18 శాతానికి తగ్గించారని తెలిపారు. మరికొన్నింటికి కూడా 28 శాతం నుంచి 12 శాతానికి పన్ను తగ్గించారని తెలిపారు. టెక్స్‌టైల్స్‌పై పన్ను విధింపును తాము వ్యతిరేకించినా జాతీయ స్థాయిలో పన్ను విధించేందుకు నిర్ణయించారని తెలిపారు. యార్న్, ఫైబర్ ఇన్‌పుట్‌లపై ఇన్‌పుట్ టాక్స్ వర్తించే అన్ని ఫ్యాబ్రిక్‌లకు 5 శాతం పన్ను విధించేందుకు నిర్ణయించారని వివరించారు. ఎరువులు, ట్రాక్టర్లు, చేపల వలలపై కూడా పన్ను తగ్గించాలని కోరామన్నారు. ఎండుచేపలకు సంబంధించి 5 శాతం పన్ను విధింపునకు కౌన్సిల్ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వం భూమిని సమకూర్చి ఇళ్లు నిర్మిస్తున్న సందర్భాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారి గృహ నిర్మాణ కాంట్రాక్టు పనులకు పన్ను శాతాన్ని 18 నుంచి 12 శాతానికి తగ్గించాలని కోరామన్నారు. ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థ, కాంట్రాక్టర్లు లేకుండా సొంతంగా ఇళ్లు నిర్మించుకునే వారికి పన్ను లేదని తెలిపారు. టిటిడికి సంబంధించి ప్రసాదం, మానవ వెంట్రుకలకు పన్ను మినహాయింపు ఇచ్చారని, మిగిలిన అంశాలపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. వ్యాపారులపై వేధింపులు లేకుండా చూసేందుకు రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఎత్తివేయాలని, లీకేజీలను నిరోధించేందుకు ఇ-వే బిల్లులను ప్రవేశపెట్టాలని ఆయ న సూచించారు. సిజిఎస్టీకి సంబంధించి వివిధ నోటిఫికేషన్లను ఈ నెల 22న జారీ చేయనున్నారని, అదే తరహాలో ప్రభుత్వం కూడా ఎస్‌జిఎస్టీ చట్ట నోటిఫికేషన్‌ను జారీ చేస్తుందని మంత్రి యనమల వివరించారు.