ఆంధ్రప్రదేశ్‌

హౌసింగ్ స్కీమ్‌కు నేడు శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 18: పట్టణ ప్రాంతాల్లో నివసించే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం నిర్మించబోయే బహుళ అంతస్తుల గృహ సముదాయాలకు ముఖ్యమంత్రి నా రా చంద్రబాబునాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు కలిసి సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి రిమోట్ వీడియో లింక్ ద్వారా ఒకేసారి రాష్ట్రంలోని 28 పట్టణ ప్రాంతాల్లో శంకుస్థాపన చేయనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే వేదిక పైనుంచే ముస్లిం సోదరులకు ఇచ్చే రంజాన్ తోఫా కిట్‌ల పంపిణ కార్యక్రమాన్ని లాంఛనంగా అందచేస్తారు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి కళాక్షేత్రంలో జరుగుతున్న భారీ ఏర్పాట్లను కలెక్టర్ బి లక్ష్మీకాంతం, జెసి గంధం చంద్రుడు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, ఇతర అధికారులు పరిశీలించారు.