ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర సంస్థలతో తూ.గో.జిల్లాకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 18: కేంద్ర ప్రభుత్వం నేరుగా మంజూరు చేసిన వివిధ కీలక సంస్థల ఏర్పాటుతో తూర్పు గోదావరి జిల్లాకు మహర్దశ పట్టనుంది. గతంలో లేని విధంగా కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహకారంతో కొన్ని కీలక సంస్థలు ఈ జిల్లాలో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుండి గ్రీన్‌సిగ్నల్ లభించింది. దీంతో ఆయా సంస్థల ఏర్పాటుకు అవసరమైన భూమిని సేకరించడంతో పాటు ఇప్పటికే సిద్ధంగా ఉన్న వసతుల్లో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసింది. వివిధ సంస్థల ఏర్పాటు, అందుకు అవసరమైన నిధులు, నిర్మాణం తదితర అంశాలపై డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్)లను ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం చేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడను రెండేళ్ళ క్రితం కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీగా ప్రకటించింది. రానున్న ఐదేళ్ళలో స్మార్ట్‌సిటీగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోంది. అయితే స్మార్ట్‌సిటీ అభివృద్ధితో సంబంధం లేకుండా, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలను అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కాకినాడ నగరంలో గల నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ కేంద్రం విస్తరణకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని కేంద్రం సంబంధిత శాఖ అధికారులకు సూచించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఠాగూర్ కల్చరల్ కాంప్లెక్స్‌ల నిర్మాణంలో భాగంగా కాకినాడలో గోదావరి కళాక్షేత్రం నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని అధికారులు గుర్తించారు. కేంద్రం అమలుచేస్తున్న స్వదేశీ దర్శన్ పథకం కింద టూరిజం, ఎకో టూరిజం స్పాట్స్‌ను తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. హోప్ ఐలాండ్, కోరింగ అభయారణ్యాల అభివృద్ధికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. నర్సరీలకు ప్రఖ్యాతిగాంచిన కడియంలో ఫ్లోరీ కల్చర్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు కేంద్రం ముందుకువచ్చింది. జిల్లాకు మంజూరైన సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గుర్తించాలని కేంద్రం ఆదేశించింది. జిల్లాలోని అంతర్వేది పల్లిపాలెంలో కేంద్రం మంజూరు చేసిన ఫిష్ లాండింగ్ హార్బను 22.30 కోట్ల అంచనాతో నిర్మిస్తున్నారు. అలాగే కాకినాడలో మల్టీమోడల్ లాజిస్టిక్ సెంటర్, ఫ్యాషన్ టెక్నాలజీ సెంటర్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను సేకరిస్తున్నారు. రాజమహేంద్రవరంలో ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సెంటర్, సైన్స్ మ్యూజియంల ఏర్పాటుకు స్థలాలను సేకరించాలని కేంద్రం స్పష్టం చేసింది.
కేంద్రం మంజూరు చేసిన ఆయా సంస్థలన్నిటికీ రానున్న ఒకటి, రెండు నెలల్లో భూసేకరణ ప్రక్రియను పూర్తిచేసే పనిలో అధికారులున్నారు.