ఆంధ్రప్రదేశ్‌

గిరిజన ప్రాంతాల్లో మంచినీటి కోసం రూ. 105 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 19: గిరిజన ప్రాంతాల్లో మంచినీటి అవసరాల కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ. 105 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ తెలిపారు. వెలగపూడి సచివాలయం బ్లాక్ 1లోని సమావేశమందిరంలో సోమవారం సాయంత్రం వివిధ సంక్షేమ శాఖలు, గురుకుల పాఠశాలలు, విద్యార్థి వసతి గృహాలకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. గిరిజన, ఎస్టీ ప్రాంతాల్లో రోడ్లు, నరేగా, నాబార్డ్ నిధుల వినియోగం, మంచినీటి సరఫరా, సోలార్ విద్యుత్, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో విద్యుత్ వినియోగం తదితర అంశాలను చర్చించారు. ఆయా శాఖల అధికారులు పరిస్థితులను వివరించారు. 7298 విశ్వవిద్యాలయాల కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో మొత్తం 15,78,759 మంది విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నట్లు అధికారులు సిఎస్‌కు వివరించారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు సంబంధించి డిజిటల్ సిగ్నేచర్ ఆమోదించే విధంగా తాను ట్రెజరీ అధికారులతో మాట్లాడతానని సిఎస్ తెలిపారు. సోలార్ విద్యుత్ వినియోగించే విధంగా పైలెట్ ప్రాజెక్ట్‌కు 5 పాఠశాలలను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ పాఠశాలల్లో బల్బులతో పాటు వంటకు కూడా సోలార్ విద్యుత్‌ని వినియోగిస్తారు. రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలలు, విద్యార్థి వసతి గృహాల్లో సాధారణ విద్యుత్‌ని ఆదా చేయాలని ఆయన తెలిపారు. ఈ బల్బుల మార్పిడి ప్రక్రియ జూలై నెల ఆఖరుకు పూర్తి చేయాలని చెప్పారు. ఈ ప్రక్రియను ముందుగా పూర్తి చేసి జిల్లాలకు ఆగస్టు 15న అవార్డులు ప్రకటస్తామన్నారు. ఎనర్జీ ఆడిట్‌ని జూలై చివరకు పూర్తి చేయాలన్నారు. గిరిజన, ఎస్టీలు నివశించే 575 ప్రాంతాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) నిధులతో గ్రావెల్ రోడ్లు వేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గిరిజన, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వినియోగించి ఆయా వర్గాలు నివశించే ప్రాంతాల్లో బిటి రోడ్లు వేయించాలని చెప్పారు. ఎస్సీలు 500 మందికిపైన, ఎస్టీలు 250 మందికిపైగా ఉన్న ప్రాంతాల్లో బిటి రోడ్లు వేయించాలన్నారు.

రేపు డిఇవో కార్యాలయాల దిగ్బంధం
విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 19: ఉపాధ్యాయ బదిలీల్లో విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఫ్యాప్టో-జాక్టో ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీన జరిగే డిఇఓ ఆఫీసులు దిగ్బంధన కార్యక్రమంలో ఉపాధ్యాయులంతా పాల్గొనాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. వేసవిలో బదిలీలు చేయటంలో విద్యాశాఖ విఫలమైందని, బదిలీల షెడ్యూలు ఇప్పటికి నాలుగుసార్లు మార్పు చేశారని అన్నారు.