ఆంధ్రప్రదేశ్‌

గృహనిర్మాణానికి కాకినాడ పోర్టు భూమి కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 19: కాకినాడ పోర్టుకు చెందిన భూములను ఎట్టకేలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాలకు వినియోగించేందుకు మార్గం సుగమం అయ్యింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘2022 నాటికి అందరికీ ఇళ్ళు’ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో బడుగు, బలహీన వర్గాల గృహ నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. పేద వర్గాలకు గృహాలు నిర్మించేందుకు అవసరమైన భూములు జిల్లా కేంద్రం కాకినాడ నగర పరిధిలో లేకపోవడంతో భూములను అనే్వషించాలని ప్రభుత్వం గతంలో ఆదేశించింది. ఈనేపథ్యంలో కాకినాడ పోర్టుకు చెందిన భూముల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విన్నవించారు. దీంతో ఖాళీగా ఉన్న పోర్టు భూములను సర్వే చేయాలని సూచిస్తూ, అక్కడ పేదల గృహ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సంబంధిత శాఖల అధికారుల సర్వే నిర్వహించి, పోర్టుకు చెందిన సుమారు 47 ఎకరాల భూమిని గృహ నిర్మాణం నిమిత్తం ఎంపిక చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన 47 ఎకరాల భూమిలో గృహ నిర్మాణాన్ని చేపడుతున్నట్టు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు చెప్పారు. ఇక్కడ నిర్మించే గృహ నిర్మాణాలకు 342 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. జిల్లాలో రానున్న రెండు సంవత్సరాల్లో సుమారు 80వేల గృహాలను నిర్మించేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ గృహాలను నిర్మిస్తారు. పిఎం ఆవాస్ యోజన, ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద నిర్మించే గృహాలను జి-ప్లస్ 2 విధానంలో మూడు టైపులుగా నిర్మించనున్నారు. ఈ గృహాలను వచ్చే 15నెలల కాలంలో నిర్మించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సొంత ఇళ్ల స్థలాలు కలిగివున్న పేదలకు కూడా గృహాలను మంజూరు చేస్తున్నారు. ఈ విధంగా కాకినాడ నగరంలో ప్రస్తుతం 5,600 మందికి చెందిన సొంత స్థలాల్లో గృహ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. గృహ నిర్మాణాన్ని నాణ్యతతో సక్రమంగా చేపట్టాలని, నిర్మాణం అనంతరం ఇతర సౌకర్యాలు కల్పించి నివాసయోగ్యంగా మలచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.