ఆంధ్రప్రదేశ్‌

భూ కుంభకోణం నిరూపిస్తే.. రాజకీయాలకు స్వస్తి చెబుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: భూ కుంభకోణాల్లో తన పేరు ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాలకు స్వస్తి చెబుతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అధ్వర్యంలో జరిగిన అతి పెద్ద భూ కుంభకోణమని బొత్స సోమవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. 233 గ్రామాల్లో సుమారు లక్ష ఎకరాల వరకు రికార్డులు తారుమారు అయ్యాయని ఆయన తెలిపారు. రెండు లక్షల 93 వేల ఎఫ్‌ఎంబీలు మాయమయ్యాయని ఆయన చెప్పారు. డిజిపి చెబుతున్నట్లు ఈ కుంభకోణం రెండు గ్రామాల్లో కేవలం 270 ఎకరాల్లో మాత్రమే కాదని, రెండు లక్షల ఎకరాల్లో జరిగిన భారీ కుంభకోణమని అన్నారు. విశాఖ సెక్యురిటీ హౌస్ పక్కన గజం లక్ష రూపాయల విలువ చేసే దస్‌పల్లా భూములను కూడా అన్యాక్రాంతంగా దోచుకున్నారని ఆయన విమర్శించారు. ఈ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపితేనే సూత్రధారులు, పాత్రదారులు బయటకు వస్తారని ఆయన అన్నారు. భూ కుంభకోణంపై సిట్‌తో దర్యాప్తు జరిపిస్తే ప్రయోజనం ఉండదని, సిబిఐ విచారణ జరిపించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంపై ప్రజలకే కాకుండా కొంత మంది మంత్రుల్లో, బిజెపి నాయకుల్లో కూడా అనుమానాలున్నాయని అన్నారు. విశాఖ జిల్లాలో జరిగిన ఈ భూ కుంభకోణంలో తన పేరు (బొత్స బ్రదర్స్) ఉంటే తలదించుకుని రాజకీయాలకు స్వస్తి చెబుతానని, పిరికిపందల్లా స్టేలు తెచ్చుకోనని అన్నారు. విశాఖలో రాజీవ్ స్వగృహ భూములను గీతం వర్సిటీకి ధారాదత్తం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. భూ కుంభకోణాలకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తామని, 22న విశాఖలో నిర్వహించనున్న మహా ధర్నాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని ఆయన తెలిపారు.