ఆంధ్రప్రదేశ్‌

జూలైలో ఎయిమ్స్ నిర్మాణ పనులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూన్ 19: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ శివారులో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (ఎయిమ్స్) నిర్మాణ పనులు జూలైలో ప్రారంభమవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. సోమవారం పట్టణ శివారులోని ఎపిఐఐసి ఐటిపార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎపి వైద్యసేవలు, వౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎపిఎంఎస్‌ఐడిసి) ప్రధాన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఎయిమ్స్‌కు సంబంధించిన డిజైన్లను తిరుపతిలోని స్విమ్స్‌కు చెందిన అడ్వైజర్ రవికుమార్ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చూపారని, త్వరలోనే టెండర్లు ఖరారు చేసి జూలై నుంచి పనులు ప్రారంభిస్తామని మంత్రి కామినేని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 828 మంది వైద్యుల నియామకానికి కార్యాచరణ ప్రారంభించామని, 327 మంది పీజీ వైద్యులను ఎపిపిఎస్‌సి ద్వారా రిక్రూట్ చేస్తామని, ఇందుకోసం ఆర్థిక శాఖనుంచి అనుమతి కూడా తీసుకున్నామన్నారు. మరో 501 మంది గ్రాడ్యుయేట్ వైద్యులను ఒప్పంద పద్ధతిన నియమిస్తామన్నారు. కలెక్టర్లకు ఉత్తర్వులిచ్చి వైద్యుల నియామకం పారదర్శకంగా జరుపుతామని మంత్రి కామినేని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో డ్రగ్స్, శానిటేషన్ , ఇతర అన్ని సదుపాయాలు ఎపిఎంఎస్‌ఐడిసి సంస్థ చూస్తుందని, 128 కోట్లతో అన్ని ఆస్పత్రులను అభివృద్ధి చేశామని మంత్రి పేర్కొన్నారు. 20 కేంద్రాల్లో డయాలసిస్ విభాగాలు ఏర్పాటు చేశామని, అవి కార్పొరేట్ ఆస్పత్రుల మాదిరిగా సేవలందిస్తున్నాయన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో రాజకీయ జోక్యం లేకుండా చూస్తున్నామని తెలిపారు. మంగళగిరిలో నిర్మించే ఎయిమ్స్‌లోనే క్యాన్సర్ ఆస్పత్రి కూడా ఉంటుందని వెల్లడించారు. లక్షలోపు జనాభా ఉన్న పట్టణాల్లో అర్బన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటు ఉండబోదని, మంగళగిరిలో లక్ష జనాభా లేనందున అర్బన్ హెల్త్‌సెంటర్ ఏర్పాటు చేయలేదని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎపిఎంఎస్‌ఐడిసి చైర్మన్ ఆర్ లక్ష్మీపతి, ఎండి గోపీనాథ్, చీఫ్ ఇంజినీర్ రవీంద్ర, ఈడీ ప్రసాద్ పాల్గొన్నారు.
చిత్రం.. కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి కామినేని శ్రీనివాస్