ఆంధ్రప్రదేశ్‌

భూ కుంభకోణంపై సిబిఐ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: విశాఖపట్నం భూ కుంభకోణంపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి సమక్షంలో సిబిఐ విచారణ జరిపించాలని ఎపి కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకుని సిబిఐ విచారణ జరిపించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాయాలని ఆయన పార్టీ నాయకులు గంగాభవానీ, గిడుగు రుద్రరాజు, శైలజానాథ్, సూర్యా నాయక్, జంగా గౌతం తదితరులతో కలిసి సోమవారం విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు. లక్ష కోట్ల రూపాయల విలువ గల భూముల ఆక్రమణ జరగడం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని రఘువీరా రెడ్డి అన్నారు. టిడిపికి మిత్రపక్షమైన బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార రాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా సిబిఐ విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారని ఆయన గుర్తు చేశారు. కబ్జాదారులు ఎవరైనా, ఏ పార్టీకి చెందిన వారైనా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తూతూమంత్రంగా సిట్ విచారణ జరిపించి కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. సిబిఐ విచారణకోసం త్వరలో కేంద్ర హోం మంత్రిని కలిసి కోరనున్నామని తెలిపారు. భూ కుంభకోణాలతో విశాఖపట్నానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 22న విశాఖపట్నంలో నిర్వహించనున్న మహా ధర్నాలో పాల్గొంటారా? అని ప్రశ్నించగా, మంగళవారం తమ పార్టీ నాయకులు విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారని రఘువీరారెడ్డి తెలిపారు. సోమవారం ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా రఘువీరారెడ్డి కేక్ కట్ చేశారు.