ఆంధ్రప్రదేశ్‌

ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్న ప్రభుత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, జూన్ 19: ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాలు ఖూనీ చేస్తున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఆరోపించారు. విశాఖ జిల్లా అరకులోయలో సోమవారం నిర్వహించిన గిరిజన గర్జన ర్యాలీని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ మూడవ జాతీయ మహాసభ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె ముఖ్య అతిథిగా గిరిజనులను ఉద్దేశించి మాట్లాడుతూ బిజెపి, టిడిపి ప్రభుత్వాల తీరుతో గిరిజన ప్రాంతాల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు. రాష్ట్రంలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తామన్న హామీ ఇంతవరకు అమలు చేయలేదన్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ నిక్షేపాల పేరిట చిచ్చురేపడం దురదృష్టకరమన్నారు. గిరిజనుల జీవన మనుగడకు విఘాతం కల్పించే బాక్సైట్ తవ్వకాల జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసారు. భద్రతా దళాలను ఉపయోగించుకుని తమ పోరాటాలను అణిచివేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పెదలబుడు పంచాయతీని దత్తత తీసుకున్నట్టు ప్రకటించినప్పటికీ ఈ పంచాయతీలో సదుపాయాలు కరవయ్యాయన్నారు. కేంద్ర, ర్రాష్ట ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమిస్తామన్నారు. సభలో పాల్గొన్న చత్తీస్‌ఘడ్ రాష్ట్ర బస్తర్‌కు చెందిన గిరిజన పోరాట యోధురాలు సోనిసోరి మాట్లాడుతూ గిరిజన సమస్యలపై పోరాటం చేసే తనను పోలీసులు చిత్ర హింసలకు గురిచేసి జైలుపాలు చేసారని ఆవేదన వ్యక్తం చేసారు.

చిత్రం.. గిరిజన గర్జనలో విల్లు ఎక్కుపెట్టిన బృందాకారత్