ఆంధ్రప్రదేశ్‌

మాల్స్‌లో మోసాలను నిలదీయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 19: సెలక్ట్ ఛానల్ బ్రాండ్‌తో మల్టీనేషనల్ కంపెనీలు తమ ఉత్పత్తులను బడా మాల్స్, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకుల్లో అధిక ధరలకు విక్రయించే విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. సోమవారం రాత్రి విజయవాడ బందరు రోడ్డులోని పివిపి మాల్‌లోని పలు షాపులను సంబంధిత అధికారులతో కలిసి మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఎమ్మార్పీ ధరలకు, మాల్స్‌లో అమ్మే ధరలకు చాలా వ్యత్యాసం గుర్తించామన్నారు. ఇప్పటికే సంబంధిత మాల్స్‌లో అధిక ధరలకు విక్రయించే షాపు యజమానులకు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు నోటీసులు జారీచేశారన్నారు. వీటిపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. మాల్స్, ఇతరత్రా చోట్ల అధిక ధరలకు అమ్మకాలను ప్రజలు కూడా ప్రశ్నించే విధానం రావాలన్నారు. తిరుబండారాలు, సినిమా టిక్కెట్లు తదితర వస్తువులను కొనుగోలు చేసే సమయంలో ధరలను పరిశీలించి ఎమ్మార్పీ రేటు కంటే ఎక్కువ ధరకు అమ్మితే ప్రశ్నించాలని మంత్రి సూచించారు. విశాఖపట్నంలో పెట్రోల్ బంక్ తనిఖీ కోసం అని వెళితే పిడుగు పడుతుందనే నెపంతో బంకు యజమాని బంకును మూసివేశారన్నారు. అయితే పెట్రోల్ బంకు కొలతలను సూచించే మదర్ చిప్‌ను తొలగించి డూప్లికేట్ చిప్‌ను వినియోగించడమే ఇందుకు అసలు కారణమన్నారు. ఈ విధంగా చేయటం ద్వారా 5 లీటర్ల పెట్రోల్‌కు గాను, నాలుగున్నర లీటర్లే పోస్తూ, అరలీటరు మేర వినియోగదారులను మోసగిస్తున్నారని మంత్రి వివరించారు. ఇలాంటి విధానాలను అరికట్టాలంటే కేవలం ప్రభుత్వం ఒక్కటే సరిపోదని, వినియోగదారుల్లో చైతన్యం రావాలని మంత్రి పేర్కొన్నారు. కిన్‌లే, ఆక్వాఫిన్ కంపెనీలకు చెందిన ఉత్పత్తులతోపాటు పాప్‌కార్న్, కెఎఫ్‌సి లాంటి తినుబండారాలు మాల్స్‌లో అధిక ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాల్స్‌లోని కెఎఫ్‌సి, డొమినోస్, నూట్రీఫీష్, లంచ్‌బాక్స్ కేంద్రాలను మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. అదే విధంగా మాల్స్‌లోకి వచ్చిన కొనుగోలుదారులను, యువతను రేట్ల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తూనికలు, కొలతల శాఖ అధికారులు 7 కేసులు నమోదు చేశారు. కార్యక్రమంలో మంత్రితోపాటు తూనికలు, కొలతల శాఖకు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ రాజ్‌కుమార్, ఎన్.నాగేశ్వరరావు, డిఎస్‌వో నాగేశ్వరరావు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. విజయవాడ పివిపి మాల్‌లోని దుకాణంలో ధరలను పరిశీలిస్తున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు