ఆంధ్రప్రదేశ్‌

సిట్ కాదు..సిబిఐ దర్యాప్తు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 19: విశాఖ భూ కుంభకోణం మూలాలు తేలాలంటే సిట్ విచారణ సరిపోదని, సిబిఐ దర్యాప్తు జరపాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు డిమాండ్ చేశారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిబిఐ రాజ్యాంగ పరమైన దర్యాప్తు సంస్థని, సిట్ పరిధి నామమాత్రమేనన్నారు. విశాఖ జిల్లా మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణ, రికార్డుల ట్యాంపరింగ్‌పై మాత్రమే సిట్ విచారణ జరుపుతుందని, దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. సిట్ విచారణలో రెండు గ్రామాలకే పరిమితం చేస్తూ మిగిలిన వాటిని విస్మరించడం వల్ల నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. దీనిపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వేలాది ఎకరాల భూములకు సంబంధించి రికార్డులు గల్లంతయ్యాయని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారని, హుదూద్ తుపానులో ఇవి గల్లంతై ఉంటాయనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హుదూద్ తుపానులో ఎక్కడా రెవెన్యూ భవనాలకు నష్టం వాటిల్లలేదన్నారు. ఈ అంశాన్ని కూడా దర్యాప్తులో చేర్చాలన్నారు. ఈ కుంభకోణాన్ని ఇద్దరు మంత్రుల మధ్య తగువుగా చిత్రీకరిస్తున్నారని, అధికార, విపక్ష పార్టీల రాజకీయ వివాదంగా మలుస్తున్నారని మండిపడ్డారు. విశాఖ భూ కుంభకోణంపై సిట్ విచారణకు ఆదేశించడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠినంగా ఉన్నారని డిజిపి సాంబశివరావు ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఒక అధికారిగా సాంబశివరావు ముఖ్యమంత్రి తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారన్నారు.
అలాగే భూ కుంభకోణానికి సంబంధించి రికార్డులను తారుమారుచేయడం ద్వారా బ్యాంకుల్లో రుణాలు పొందేందుకే నంటూ డిజిపి వాఖ్యానించడం నేర తీవ్రతను తగ్గించే యత్నం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అలాగే విశాఖ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా అనవసర ఫిర్యాదులు చేయవద్దంటూ డిజిపి ప్రకటించడం బాధితులపై వత్తిడి తెచ్చే విధంగా ఉందన్నారు. భూ కుంభకోణంపై రెవెన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తి బహిరంగ విచారణ జరిపిస్తామని ప్రకటించి, వెనకడుగు వేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బహిరంగ విచారణ జరిపితే వాస్తవాలు వెల్లడవుతాయన్నారు. విశాఖ భూకుంభకోణంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే తాము హాజరవుతామన్నారు. ఈ అంశంపై ఎవరు ఉద్యమించినా తాము మద్దతిస్తామని, అలాగే తాము సొంతంగా పోరాడుతామన్నారు. రాష్టప్రతి ఎన్నికకు సంబంధించి తాము ఏకగ్రీవాన్ని కోరుకుంటున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏకగ్రీవం పేరిట ఎన్‌డిఎ ప్రభుత్వం నాటకమాడుతోందని విమర్శించారు. ఈ నెల 24 వరకూ వేచిచూస్తాపని, ఎన్‌డిఏ ఏతర పక్షాలు కలిసి వస్తే లౌకిక అభ్యర్థిని పోటీకి నిలబెడతామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై బిజెపి, టిడిపిలు మోసం చేశాయని ఆరోపించారు.
దళితుల భూముల్లో కుంటలు తవ్వడం అన్యాయం
పర్చూరు: నీరు చెట్టు పేరుతో ఎంతోకాలంగా దళితులు సాగు చేస్తున్న భూముల్లో కుంటలు తవ్వడం అన్యాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు అన్నారు. ప్రకాశంజిల్లా పర్చూరు మండలంలోని దేవరపల్లి గ్రామంలో దళితులు సాగుచేస్తున్న భూములను పరిశీలించేందుకు సోమవారం ఆయన వచ్చారు. ఆర్టీసీ బస్సులో వస్తున్న మధు సహా పార్టీ నేతలను అన్నంబొట్లవారిపాలెం బస్టాండు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని మార్టూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. సాయంత్రంవరకు ఉంచి సాయంత్రం విడుదల చేశారు.