ఆంధ్రప్రదేశ్‌

కోట్లకు పడగెత్తిన సబ్ రిజిస్ట్రార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 19: సాధారణ సబ్ రిజిస్ట్రార్ రూ.కోట్ల ఆస్తులను కూడబెట్టాడు. గాజువాక సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న దొడ్డపనేని వెంకునాయుడు ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) సోమవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. విశాఖ నగరం పందిమెట్టలోని విలాసవంతమైన భవనంలో నివాసం ఉంటున్న వెంకునాయుడు ఆస్తుల చిట్టా పరిశీలించిన ఎసిబి అధికారులకే కళ్లు బైర్లు కమ్మాయి. అత్యంత విలాసవంతమైన ఈ భవనంలో వెంకునాయుడు నిర్మించుకున్న బాత్‌రూంకే రూ.25 లక్షలు వెచ్చించడాన్ని చూసి ఎసిబి అధికారులు నివ్వెరపోయారు. 1995లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో బాధ్యతలు చేపట్టిన వెంకునాయుడు నర్సీపట్నం, నెల్లిమర్ల, గాజువాక, లంకెలపాలెం, ద్వారకానగర్, ఆముదాల వలస, మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రార్‌గా పనిచేశాడు. మధురవాడలో పనిచేస్తున్న కాలంలో ఎసిబి అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో రిజిస్ట్రార్ వద్ద రూ.85,810 నగదు స్వాదీనం చేసుకుని అరెస్టు చేయడంతో నాలుగేళ్ల పాటు సస్పెన్షన్‌కు గురయ్యాడు. తిరిగి ఉద్యోగంలో చేరిన వెంకునాయుడు తాజాగా ఎసిబి సోదాలతో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి కటకటాల పాలయ్యాడు. పందిమెట్టలోని వెంకునాయుడు ఇంటితో పాటు తిరుపతి, గాజువాకల్లోని బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో జరిపిన సోదాల్లో పలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు బయటపడ్డాయి. ఎసిబి డిఎస్పీ ఎస్ రమాదేవి అందించిన వివరాల మేరకు వెంకునాయుడు ఇంటితో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో జరిపిన సోదాల్లో పలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాదీనం చేసుకున్నట్టు తెలిపారు. వీటిలో మహారాణి పేటలో అత్యంత విలాసవంతమైన భవనం, కాపులుప్పాడలో 413 చదరపు గజాల నివేశన స్థలం, నరవ సమీపంలోని సత్తివానిపాలెంలో 1130 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన రెండు స్థలాలు, జగ్గయ్యపాలెంలో 1220 చదరపు గజాల స్థలం, జగ్గయ్యపాలెంలోనే 1960 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన రెండు స్థలాలు, అడవివరంలో 300 చదరపు గజాల ఇంటి స్థలం, మధురవాడలో 1678 చ.గ నివేశన స్థలం, సత్తివానిపాలెంలో 120 చ.గ విస్తీర్ణం కలిగిన ఐదు నివేశన స్థలాలు, మధురవాడ సూర్యశక్తి నగర్‌లో 225 ఎకరాల నివేశన స్థలం, నరవలో 4 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. విశాఖ శివారు తుంగ్లాంలో బావమరిది విష్ణువర్ధన్ పేరిట 400 చ.గ నివేశన స్థలం డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే 1.75 కిలోల బంగారు, 1.3 కిలోల వెండి వస్తువులు దాడుల్లో స్వాదీనం చేసుకున్నామన్నారు. సోదాల్లో రూ.6.42 లక్షల నగదు లభించిందని, భార్య పేరిట ఒక ప్రైవేటు బ్యాంకులో లాకర్‌ను గుర్తించామని, దీన్ని ఇంకా తెరవాల్సి ఉందన్నారు. వెంకునాయుడును సోమవారం అరెస్టు చేసినట్టు ఎసిబి డిఎస్పీ రమాదేవి వెల్లడించారు.
తిరుపతిలో సోదాలు
తిరుపతి: విశాఖ జిల్లా గాజువాక సబ్‌రిజిస్ట్రార్ వెంకయ్య నాయుడుపై ఏసిబి అధికారులు సోమవారం ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని దాడులు చేశారు. తిరుపతిలోని రిజర్వాయర్ కాలనీలోని ఆయన మాజీభార్య రూప ఇంటిపైన అలాగే శ్రీకాళహస్తి, తిరుపతిలోని ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. రూపకు 2004లోనే ఆయన విడాకులు ఇచ్చారు. అయితే ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎసిబి డిఎస్పీ ఆధ్వర్యంలో సి ఐ చంద్ర బృందం రూప ఇంటిపై దాడులు చేశారు.

చిత్రం.. గాజువాక సబ్ రిజిస్ట్రార్ వెంకునాయుడు