ఆంధ్రప్రదేశ్‌

6 కార్పొరేషన్లకు ఎన్నికలు లేనట్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: రాష్ట్రంలోని ఆరు నగర పాలక సంస్థలకు ఈ ఏడాది ఎన్నికలు ఇక లేనట్లే. ఆయా నగర పాలక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయ. రాష్ట్రంలో గ్రేటర్ విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూలు, ఒంగోలు, తిరుపతి నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. చాలా నగర పాలక సంస్థలకు ఐదు సంవత్సరాలుగా పాలక వర్గాలు లేక ప్రత్యేకాధికారి పాలనలో కొనసాగుతున్నాయి. నగర పాలక సంస్థలో కొన్ని పంచాయితీలను విలీనం చేస్తూ ప్రభుత్వం అప్పట్లో నిర్ణయం తీసుకుంది. అయితే ఆ నిర్ణయాన్ని కొంతమంది కోర్టులో సవాల్ చేయడంలో ఎన్నికలు నిర్వహించేలేని పరిస్థితి ఏర్పడింది. కాకినాడ, విశాఖలో ఈ పరిస్థితిని చక్కదిద్దుతున్నామని అధికార యంత్రాంగం చెబుతున్నప్పటికీ, ఆ దిశగా సరైన ప్రయత్నం మాత్రం జరుగలేదు. దీంతో ఆ వివాదాలు కొనసాగుతున్నాయి. అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ప్రతిపాదన తెరమీదకు తెచ్చిన నేపథ్యంలో దానిని రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తిగా ఉన్నారు. ఇటీవల విశాఖ పర్యటనలో కూడా అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరిపే అంశం పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.