ఆంధ్రప్రదేశ్‌

12 మంది ఐపిఎస్‌ల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 20: రాష్ట్రంలో తొలి విడతగా 12 మంది ఐపిఎస్‌ల బదిలీలు జరిగాయి. ఐపిఎస్‌ల బదిలీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండురోజులుగా తీవ్రస్థాయిలో కసరత్తు చేశారు. పలువురు ఐపిఎస్ అధికారులతో ముఖ్యమంత్రి సోమ, మంగళవారాల్లో భేటీ అయ్యారు. వ్యక్తిగతంగా అధికారులతో మాట్లాడి బదిలీలపై సుదీర్ఘంగా చర్చించారు. విడతల వారీగా కొన్ని జిల్లాల ఎస్పీలను పిలిపించుకుని ప్రస్తుత బదిలీల ప్రాధాన్యతపై సమీక్షించారు. ఇదే క్రమంలో మంగళవారం రెండో విడతగా నెల్లూరు, గుంటూరు ఇంకా పలు జిల్లాల ఎస్పీలు, విజయవాడ పోలీసు కమిషనరేట్‌లోని ఇద్దరు డిసిపిలతో సీఎం మాట్లాడిన మీదట ముందుగా రాష్ట్రంలో 12 మంది ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.
నెల్లూరు జిల్లా ఎస్పీగా పిహెచ్‌డి రామకృష్ణ, తిరుపతి అర్బన్ ఎస్పీగా విజయరావు, చిత్తూరు-రాజశేఖర్, అనంతపురం- జివిజి అశోక్‌కుమార్, కర్నూలు-గోపినాధ్‌జెట్టి, కడప-బాపూజీ, పశ్చిమగోదావరి జిల్లా-రవిప్రకాష్, తూర్పుగోదావరి జిల్లా-విశాల్ గున్ని, విజయనగరం-జి పాలరాజు, శ్రీకాకుళం-త్రివిక్రమవర్మ, కృష్ణా-త్రిపాఠి, గుంటూరు అర్బన్-అభిషేక్ మహంతి, గుంటూరు రూరల్-అప్పలనాయుడు, ప్రకాశం-ఏసుబాబులను నియమించారు. ఇక ఐజిలు, డిఐజిలు, ఉన్నతస్థాయి అధికారుల పోస్టింగ్‌లతోపాటు, 12మంది ఎస్పీల బదిలీల్లో ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేస్తూ ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. విజయవాడ కమిషనరేట్‌లో ఉన్న ఇద్దరు డిసిపిలు పాలరాజు, అశోక్‌కుమార్‌ల బదిలీతో కొత్తవారిని నియమించాల్సి ఉంది. టిడిపిఅధికారంలోకి వచ్చి మూడేళ్ళు ముగియగా మరో రెండేళ్లల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పోలీసు అధికారుల బదిలీలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రంలోని ఒకటి రెండు మినహా మిగిలిన అన్ని జిల్లాల ఎస్పీలు టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత పోస్టింగ్‌ల్లోకి వచ్చిన వారే. వీరి పదవికాలం కూడా రెండున్నరేళ్ళు దాటిపోవడంతో బదిలీలు అనివార్యమయ్యాయి. అదేవిధంగా మరికొందరు ఉన్నతస్థాయి అధికారులకు కూడా పోస్టింగ్‌లు కల్పించాల్సి ఉంది. పైగా కొంతమందికి పదోన్నతులు వచ్చినా పోస్టింగ్ రాక ఉన్న స్థానాల్లోనే కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతాపరంగా పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంది. ముఖ్యంగా కీలకమైన విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా గౌతం సవాంగ్ కొనసాగుతున్నా.. ఈయనకు ఆగస్టు నాటికి రెండేళ్లు పూర్తవుతుంది. ఈయన బదిలీ అనివార్యమైతే ఈ స్ధానంలో నియమించే అధికారి అదనపు డిజి హోదా కలిగినవారై ఉండాలి. ప్రస్తుతం అదనపు డిజి హోదాలో ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు, సిఐడి చీఫ్ ద్వారకా తిరుమలరావులు ఉన్నారు. ఏబి వెంకటేశ్వరరావు గతంలో రెండుసార్లు విజయవాడ సీపిగా పని చేసినా పూర్తికాలం ఉండలేదు. ఇక ద్వారకా తిరుమలరావు ఆసక్తి కనపరుస్తున్నట్లు సమాచారం. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనూరాధ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఖాళీగా ఉన్నందున గౌతం సవాంగ్‌ను ఇక్కడకు బదిలీ చేసి ద్వారకా తిరుమలరావును సీపిగా తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.