ఆంధ్రప్రదేశ్‌

చావోరేవో తేల్చుకుంటాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 20: కాపులకు రిజర్వేషన్ విషయంలో చావోరేవో తేల్చుకుంటామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినప్పటికీ దాని గురించి నేటి వరకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఇక్కడ తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ పొరుగు రాష్టమ్రైన తెలంగాణలో కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు సబ్ కమిటీ వేశారని, ఎపిలో చంద్రబాబు ఎలాంటి ప్రయత్నం చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాపుల రిజర్వేషన్ కోసం తాము ఎన్ని ఉద్యమాలు చేపట్టినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన కానరావడం లేదన్నారు. రిజర్వేషన్ల కోసం తాము ఇంకెంత కాలం వేచి ఉండాలని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 26న తాను ‘్ఛలో అమరావతి’ పేరిట తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడి నుంచి అమరావతి వరకు 600 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మద్దతు కోరుతున్నామన్నారు. తాము గతంలో శాంతియుతంగా ఉద్యమాన్ని చేపట్టినా తన కుటుంబంపై అక్రమ కేసులను బనాయించారని విమర్శించారు. అయినప్పటికీ తాము కాపు రిజర్వేషన్ల కోసం వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. తాము చేపట్టే పాదయాత్రకు మద్దతునివ్వాలని ఆయన ఇక్కడ వైకాపా ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి, వైకాపా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, వివిధ కుల సంఘాల బిసి నాయకులను కోరారు. దీనికి వారు సంఘీభావం తెలిపారు.