ఆంధ్రప్రదేశ్‌

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 20: బంగాళాఖాతంలో విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు మధ్య అల్పపీడన ద్రోణి ఏర్పడినట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం మంగళవారం రాత్రి తెలియచేసింది. దీని ప్రభావం వలన కోస్తాలో అక్కడడక్కడ చెదురు మదులు జల్లులు పడే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల పొడి వాతావరణమే ఉంటుందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. మంగళవారం ఉత్తర కోస్తాలో సాధారణం కన్నా రెండు, మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనాయి. దక్షిణ కోస్తా అంతటా సాధారణ ఉష్ణోగ్రతలే నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.