ఆంధ్రప్రదేశ్‌

వస్త్ర వ్యాపారుల ‘చలో ఢిల్లీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: వస్త్రాలపై జిఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వస్త్ర వ్యాపారులు ఈ నెల 22, 23 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ టెక్స్‌టైల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బూసిరెడ్డి మల్లేశ్వర రెడ్డి చెప్పారు. నగరంలోని ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వస్త్రాలపై జిఎస్టీని రద్దు చేయాలని కోరుతూ టెక్స్‌టైల్ జిఎస్టీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో భారత దేశ వ్యాపితంగా ఉద్యమం కొనసాగుతోందన్నారు. అందులో భాగంగా జిఎస్టీపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, అరుణ్ జైట్లీ, తదితర పెద్దలను కలిసి ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ నెల 22, 23 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. అక్కడ సరైన సానుకూల స్పందన రాకుంటే ఈ నెల 24వ తేదీ నుంచి దేశవ్యాపితంగా నిరవధిక సమ్మెకు వెళ్లేందుకు వస్త్ర వ్యాపార సంఘాలు నిర్ణయించినట్లు వివరించారు. వస్త్రాలపై ఇప్పటివరకు ఎటువంటి పన్ను లేదన్నారు. కేవలం ఉత్పత్తి కేంద్రాల వద్దే ప్రభుత్వం వారికి కావల్సిన పన్ను వేసి వసూలు చేస్తుందన్నారు.