ఆంధ్రప్రదేశ్‌

రాష్టప్రతి వద్దకు ఏకీకృత ఫైల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు రూల్స్‌కు సంబంధించిన ఫైలు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు చేరుకుంది. ఇప్పటికే ఈ సర్వీసు రూల్స్ ఫైల్‌ను ప్రధాన మంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి సంతకం చేసి ఆమోదించిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ ఫైలుపై ప్రధాని నరేంద్ర మోదీ సంతకం చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయంనుంచి ఈ ఫైల్ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం కోసం పిఎంఓ అధికారులు పంపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు రూల్స్ నిబంధనల అమలుకోసం రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఏకీకృత సర్వీసు రూల్స్ ఫైల్‌కు కేంద్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపి హోంశాఖకు పంపించింది. అనంతరం ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపించింది. మంగళవారం ఈ ఫైల్ పిఎంఓనుంచి రాష్టప్రతి కార్యాలయానికి చేరుకుంది. రాష్టప్రతి ఆమోదముద్ర వేయగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు రూల్స్ నిబంధనలు అమలులోకి వస్తాయి.