ఆంధ్రప్రదేశ్‌

జగన్ డబుల్ గేమ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 20: రాష్ట్రంలో రెండు బలమైన కులాల విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుసరిస్తున్న ద్విపాత్రాభినయం ఆ పార్టీలో గందరగోళానికి కారణమవుతోంది. ఒకవైపు కాపులను బీసీల్లో చేర్చే ఉద్యమంలో పాల్గొని మద్దతు ప్రకటిస్తూనే, మరోవైపు కాపులకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ చేస్తున్న ఆందోళనపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని, బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదని ఇటీవల జరిగిన బీసీ సెల్ అధ్యక్షుడి ప్రమాణస్వీకారంలో వైసీపీకి చెందిన కాపు నేతలు చేసిన ప్రకటనలు గందరగోళానికి దారితీస్తున్నాయి. టిడిపి బీసీలకు అన్యాయం చేస్తోందంటూ కాపు నేతలతో ప్రకటనలు చేయించడాన్ని బీసీలు జీర్ణించుకోలేకపోతున్నారు. బీసీలకు జరిగే అన్యాయాలు బీసీలకే తెలుస్తాయని, అదేదో తమతో మాట్లాడించకుండా, అది కూడా కాపు నేతలతో మాట్లాడించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కాపు ఉద్యమంలో స్వయంగా పాల్గొంటున్న బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తదితర నేతలు బీసీల గురించి మాట్లాడటం వల్ల పార్టీలోని బీసీలు దూరమయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. టిడిపి ఓ వైపు బీసీకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడంతోపాటు, మంత్రి పదవులు, నామినేటెడ్ పదవుల్లోనూ ప్రాధాన్యం ఇస్తుంటే తమ పార్టీలో మాత్రం అందుకు భిన్నంగా ఉందని గుర్తు చేస్తున్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని బీసీలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసి కూడా జగన్ దానిని పట్టించుకోకుండా, బాహాటంగానే కాపులకు మద్దతు ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. తాను కాపులకు మద్దతునిచ్చానన్న విషయాన్ని విస్మరించి, బీసీలకు బాబు ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ.. బీసీల కోసం పోరాడతామని తాము వ్యతిరేకించే కాపు నేతలతో ప్రకటనలు చేయించడం, బీసీలను మోసం చేయడమే అవుతోందని బీసీ నేతలు చెబుతున్నారు. పార్టీలో చాలామంది బీసీ నేతలున్నప్పటికీ, వారిని కాదని కాపులను అందలమెక్కిస్తున్న జగన్ వైఖరిపై బీసీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీలో ఎక్కడా బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, మెజారిటీ బీసీలు టిడిపి వైపు ఉన్నందున ఆ వర్గాన్ని ప్రోత్సహించడం వల్ల వచ్చే రాజకీయ ప్రయోజనం ఏమీ లేదని, కాపులను ప్రోత్సహిస్తే ఓట్లు వస్తాయన్న జగన్ వైఖరిని బీసీ నేతలు తప్పుపడుతున్నారు. కాగా, ముద్రగడ ఉద్యమం నాటి నుంచీ పార్టీలో కాపు-బీసీ నేతల మధ్య పొసగడం లేదు. మీడియా సమావేశాలు, ఇతర సందర్భాల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, కాపులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ వ్యవహారశైలి వల్ల గోదావరి జిల్లాల్లో బీసీలు, ప్రధానంగా శెట్టి బలిజలు పార్టీకి దూరమయ్యారని గుర్తు చేస్తున్నారు. ‘టిడిపిలో కమ్మ నేతల తర్వాతే ఎవరికైనా ప్రాధాన్యం ఉంటుందనేది బహిరంగం. కానీ వాళ్లు దానిని బయటకు ప్రదర్శించరు. అందరికీ ప్రాధాన్యం ఇస్తున్నామన్న భావన కలిగిస్తుంటారు. అది నిజం కాదని అందరికీ తెలుసు. కానీ ఎవరికి ఇవ్వాల్సిన గౌరవమైతే వారికి ఇస్తారు. రెడ్లు వైసీపీ-కాంగ్రెస్ వైపే ఎక్కువగా ఉంటారని తెలిసి కూడా వారికి టిడిపి అన్నింటా ప్రాధాన్యం ఇస్తుంటుంది. ఫలానా కులాన్ని తక్కువ చేస్తున్నామన్న భావన ఎక్కడా కనిపించనీయదు. కానీ మా లీడర్ జగన్ ఐడియాలజీ అందుకు భిన్నంగా ఉంటుంది. కాపులకు బహిరంగంగానే ప్రాముఖ్యం ఇస్తున్నారు. వైఎస్ ఉన్నప్పుడు శెట్టిబలిజలకు ప్రాధాన్యం ఇచ్చినందువల్లే గోదావరి జిల్లాల్లో ఆ వర్గం వాళ్లు అప్పుడు కాంగ్రెస్‌కు ఓట్లేశారు. ఎవరి ప్రాధాన్యం వాళ్లకు ఇవ్వాలే తప్ప, ఫలానా వాళ్లకు ప్రాధాన్యం ఇస్తే ఓట్లు రావన్న కోణంలో చూస్తే పార్టీ దెబ్బతింటుంద’ని వైసీపీకి చెందిన ఓ బీసీ నేత వ్యాఖ్యానించారు.