ఆంధ్రప్రదేశ్‌

‘పోటీ’ నుంచి తప్పుకున్న టిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 20: అధికార టిడిపి ఇటీవల కాలంలో సెల్ఫ్‌గోల్స్ వేసుకుంటోంది. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు జగన్‌ను కట్టడి చేయడానికి ప్రయత్నించి టిడిపి నాలుక కరుచుకుంటోంది. ఒక్క విశాఖపట్నంలోనే జగన్‌ను నియంత్రించే క్రమంలో ఆ పార్టీ విఫలమవుతూ వచ్చింది. దీంతో ప్రజల్లోను, పార్టీ శ్రేణుల్లోను పార్టీ నేతల ప్రతిష్ఠ దిగజారుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని జగన్ ఈ ఏడాది జనవరి 26న విశాఖ బీచ్ రోడ్డులో ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఆ ఉద్యమానికి జనం ఏమేరకు తరలి వస్తారు? ఉద్యమం ఎంత వరకూ సఫలీకృతమవుతుంది? అన్న లెక్కలేమీ వేసుకోకుండానే, ఆరోజు బీచ్ రోడ్‌లో అప్రకటిత కర్ఫ్యూ విధించారు. ఆ రోజు సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న జగన్‌ను అక్కడి నుంచి బయటకు రానీయకుండా కట్టడి చేశారు. జగన్ వచ్చి దీక్ష చేసినా, అధికార పక్షానికి అంత ఇబ్బంది ఉండేది కాదు. అయితే, జగన్‌ను నియంత్రించడం వలన ప్రజల్లో సానుభూతి పెరిగింది. ఈ ఘటనలో టిడిపి సెల్ఫ్ గోల్ వేసుకుందన్న వాదన వినిపించింది. ఇక విశాఖ భూ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ, వైకాపా అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్ నేతృత్వంలో ఈనెల 22న విశాఖలో మహా ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజున టిడిపి కూడా విశాఖలో మహా సంకల్ప సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే భూముల కుంభకోణంలో పీకల్లోతు వరకూ కూరుకుపోయిన టిడిపికి ఈ సభ అవసరమా? ఈ సభ కేవలం ఆత్మరక్షణ కోసమే అన్నది విశే్లషకుల అభిప్రాయం. విశాఖ భూ కుంభకోణంలో టిడిపి నేతల హస్తం ఉందన్నది సుస్పష్టం. అధికారులను అనేక రకాలుగా లొంగదీసుకుని భూముల రికార్డుల టాంపరింగ్ చేసిందన్నది కూడా నిజం. ఈ నిజాలేవీ వెలుగు చూడకుండా ఉండేందుకు అధికార పార్టీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఈ కథను ఓపక్క నడిపిస్తునే, మరోపక్క జగన్‌పై ఎదురు దాడికి సిద్ధమవుతోంది. అయితే, 22న జరగనున్న మహా ధర్నాలో జగన్ ఏం చెపుతాడన్నది వినకుండానే, అదే రోజున పోటీ సభ ఏర్పాటు చేసింది. దీనివలన ప్రయోజనం లేదని సొంత పార్టీ ఎమ్మెల్యేలే చెప్పుకొచ్చారు. కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆశీస్సులతోనే ఈ కుంభకోణాన్ని అధికారులు రక్తి కట్టించారు. ఇప్పుడు సంకల్ప సభకు వచ్చి, వారు ఏం చెపుతారో చూడాలి. వీటన్నింటినీ పక్కన పెడితే, జగన్ సభకు పోటీ సభ నిర్వహించవద్దని టిడిపి సమన్వయ కమిటీ నిర్ణయించింది. మంగళవారం ఇక్కడ జరిగిన సమావేశంలో 22న మహా సంకల్ప సభ నిర్వహించకూడదని, దాన్ని 24కు వాయిదా వేయాలని నిర్ణయించింది. ఇలా అధికార పక్షమే ఒక అడుగు వెనక్కు తగ్గి, మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకుంది.