ఆంధ్రప్రదేశ్‌

సమరశీల పోరాటాలతోనే ఆదీవాసీ హక్కుల పరిరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక (విశాఖ), జూన్ 20: సమరశీల పోరాటాలతోనే ఆదివాసీల హక్కుల పరిరక్షణ సాధ్యం అవుతుందని కేరళ ముఖ్యమంత్రి పి. విజయన్ పేర్కొన్నారు. ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ (ఎఎఆర్‌ఎం) 3వ జాతీయ మహాసభలను మంగళవారం స్టీల్‌ప్లాంట్ గురజాడ కళాక్షేత్రంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విదేశీ కార్పొరేట్ బహుళ జాతి సంస్థలకు పట్టం కడుతూ ఆదివాసీల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. మతోన్మాదుల ఆగడాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రిటీష్ పాలకుల తరహాలోనే ప్రస్తుత ప్రభుత్వాల విధానాలు ఉండడం ఆదివాసీల హక్కుల అభివృద్ధికి గొడ్డలి పెట్టుగా మారిందని దుయ్యబెట్టారు. ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో గిరిజన భూముల దురాక్రమణ, గిరిజనలపై దాడులు పెరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీలు సమష్టిగా ఇటువంటి దాడులను ఎదుర్కోవాలన్నారు. భారతమాత నినాదంతో ముందుకెళ్తున్న ఎన్‌డిఎ ప్రభుత్వం విదేశీ, బహుళ జాతి సంస్థలకు మేలు చేసేందుకు ఆదివాసీల భూములను బలవంతంగా లాక్కోవడం దూర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ ఉదార ఆర్థిక విధానాలు ప్రాంతీయ, అసమానతలకు దారి తీసున్నాయన్నారు. అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో విప్లవ మహాయోధులు సమరశీల పోరాటాలతో తమ ఉనికిని, బతుకును కాపాడుకునేందుకు ఉద్యమాలు ద్వారా బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేశారన్నారు. సుదీర్ఘ పోరాటాల ద్వారా స్వాతంత్య్రాన్ని సాధించాక పరిపాలన సాగిస్తున్న మన పాలకులు గిరిజనుల పట్ల దోపిడి విధానాలను అవలంభిస్తున్నారన్నారు. సామ్యవాదం పేరుతో ఉదార ఆర్థిక విధానాలను అమలు చేస్తూ ఆదివాసీల బతులకుతో ఆటలాడుకోవడాన్ని స్వస్తి పలికాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తూ గిరిజన ఉద్యమాలను అణించి వేస్తున్నారన్నారు. కేరళ ప్రభుత్వం ఆదివాసీల కోసం ప్రత్యేక పాఠశాలలు, ఆసుపత్రులను నెలకొల్పి విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తోందన్నారు.

కేరళ ముఖ్యమంత్రి విజయన్కేరళ ముఖ్యమంత్రి విజయన్