ఆంధ్రప్రదేశ్‌

సాంస్కృతిక, పర్యాటకశాఖ కార్యదర్శి మీనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: పర్యాటకానికి ప్రచారమే కీలకమని, ఈ విషయంలో సరైన చర్యలు తీసుకుంటేనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించగలుగుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా స్పష్టం చేశారు. పర్యాటక రంగానికి ప్రచారం పెట్టుబడి వంటిదే తప్ప వ్యయంగా చూడరాదని వివరించారు. సమగ్ర ప్రచారంతో అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించగలిగినప్పుడు నవ్యాంధ్రకు అది ఆదాయ వనరుగా రూపాంతరం చెందుతుందన్నారు. శుక్రవారం విజయవాడలోని ఏపిటిడిసి కార్యాలయంలో పర్యాటక అంశాలకు సంబంధించి మీనా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఏపిటిడిసి చైర్మన్ ప్రొఫెసర్ జయరామిరెడ్డి సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు రాగా, కార్యదర్శి ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారు. అన్ని భాషల్లో పర్యాటక సాహిత్యం అందుబాటులో ఉండాలని, సంబంధిత సామగ్రి నాణ్యతను పెంచాలని ఆదేశించారు. ప్రచారంలో మూస ధోరణులకు స్వస్తిపలకాలని, ప్రస్తుత వానాకాలాన్ని సైతం ప్రచారానికి అనుగుణంగా మలచుకునేలా పర్యాటక చిహ్నంతో గొడుగులు, క్యాప్‌లు, రెయిన్ కోట్‌లు వంటివి పంపిణీ చేయవచ్చన్నారు. ఏపిటిడిసి డైరక్టర్, ఏపిటిఎ సిఇఓ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ రాష్ట్ర పర్యాటక రంగానికి సంబంధించి నిరంతరం సమాచారం చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దాదాపు 30 అంశాలపై సమావేశంలో చర్చించగా, ముఖేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ పర్యాటక రంగానికి రానున్న కాలంలో మానవ వనరుల కొరత ఏర్పడే అవకాశం ఉందని దాన్ని అధిగమించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. దీనికి సంబంధించిన సవివర సమాచారాన్ని అందించాలన్నారు.