ఆంధ్రప్రదేశ్‌

పార్శిల్ కొరియర్ విభాగం ద్వారా ఆర్‌టిసికి రెండు నెలల్లో రూ.4.80 కోట్ల రాబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: ఏపిఎస్‌ఆర్‌టిసి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు యాజమాన్యం కేవలం బస్ సర్వీస్‌లపైనే కాకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తోంది. ప్రధానంగా కొరియర్ పార్శిల్ విభాగంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. ఈ విభాగం ద్వారా గడచిన ఆర్థిక సంవత్సరంలో 15కోట్ల 50 లక్షల రూపాయల రాబడి రాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే రెండు నెలల్లోనే ఊహించని రీతిలో 4కోట్ల 80 లక్షల రూపాయల రాబడి లభించింది. దీంతో సరుకు రవాణా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆసక్తికల్గిన ప్రైవేట్ వ్యక్తులను బిజినెస్ ఫెసిలిటేటర్లుగా నియమిస్తున్నామని సంస్థ ఎండి ఎం.మాలకొండయ్య ఆంధ్రభూమి ప్రతినిధితో అన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవాడ నగరంలో భవానీపురం, హనుమాన్‌పేటలలో బిజినెస్ ఫెసిలిటేటర్ కార్యాలయాలను ప్రారంభించారు.