ఆంధ్రప్రదేశ్‌

బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: వివిధ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలుచేస్తూ వాటి ఫలితాలు అర్హులైన వారందరికీ అందేలా బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తానని శుక్రవారం గొల్లపూడిలోని సంస్థ కార్యాలయంలో చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన వేమూరి ఆనందసూర్య అన్నారు. అతి సామాన్య నిరుపేద బ్రాహ్మణుల అర్చకుల సంక్షేమం, అభ్యున్నతి కోసం పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే డొక్కా మాణిక్యవరప్రసాద్, శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, తదితరులు తమ తమ ప్రసంగాల్లో ఆనందసూర్య హయాంలో పేద బ్రాహ్మణులకు తగు న్యాయం జరుగుతుందన్నారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు పాదయాత్ర చేస్తుండగా ఆనందసూర్య ఆయన వెంట నిలచి గ్రామాల్లో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న స్థితిగతులను విశదీకరించారని అన్నారు. ఆ సమయంలోనే చంద్రబాబు స్పందించి పేద బ్రాహ్మణులు, అర్చకులను తాను అన్ని విధాలుగా ఆదుకుంటానని బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తానని హామీ నివ్వటమే గాక ఆమేర పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్పించారని అన్నారు. చెప్పిన ప్రకారం కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి ఇప్పటికి రూ.210 కోట్లు కేటాయించి పేద బ్రాహ్మణుల శ్రేయస్సు కోసం పాటుబడుతున్నారని అన్నారు. గత చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు సీనియర్ అధికారి అయినప్పటికీ ఆయనలో బ్యూరోక్రసీ లక్షణాలున్నాయని, దీనివల్ల కార్పొరేషన్‌ను సామాన్య బ్రాహ్మణుల వద్దకు తీసుకెళ్లలేకపోయారని అన్నారు.