ఆంధ్రప్రదేశ్‌

స్మార్ట్ సిటీగా అమరావతి ఎంపికపై బిజెపి హర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: అమరావతిని స్మార్ట్ సిటీగా ఎంపిక చేయడం పట్ల భారతీయ జనతాపార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్మార్ట్ సిటీగా అమరావతిని ఎంపిక చేయడంతో ఈ నగరాన్ని రూ.1000 కోట్లతో అభివృద్ధి చేసే అవకాశం లభిస్తుందన్నారు. దీనివల్ల అమరావతి శోభాయమానంగా వెలుగొందే అవకాశం లభించిందన్నారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.100 కోట్ల చొప్పున అయిదేళ్లపాటు రూ.500 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు అందచేస్తుంది...అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది రూ.100 కోట్ల చొప్పున అయిదేళ్ల పాటు రూ.500 కోట్లు నిధులు కేటాయించాలన్నారు. ఈ నిధులతో అమరావతిలో వౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ నగరాలను మాత్రమే స్మార్ట్ సిటీ జాబితాలో అవకాశం కల్పించగా, నాలుగో నగరంగా అమరావతిని ఎంపిక చేశారన్నారు. అమరావతి నగరానికి స్మార్ట్ సిటీగా ఎంపికయ్యే అవకాశం లేకున్నా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చొరవతోనే ఎంపిక చేశారని తెలిపారు. అమరావతిని స్మార్ట్ సిటీగా ఎంపిక చేసినందుకు వెంకయ్యనాయుడికి కృతజ్ఞతలు తెలిపారు.