ఆంధ్రప్రదేశ్‌

టిటిడికి ఐజిబిసి అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 23: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం మరో అవార్డు సొంతం చేసుకొంది. సహజ సిద్దమైన ప్రకృతి వాతావరణానికి ఎటువంటి విఘాతం కలిగించకుండా పర్యావరణ అనుకూల భవంతుల నిర్మాణాలు చేపట్టిన విషయంపై ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజిబిసి) తన ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది. ఈమేరకు శుక్రవారం నగరంలోని ప్రముఖ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ మంత్రి నారాయణ చేతుల మీదుగా టిటిడి తరఫున జెఈవో పోల భాస్కర్ అవార్డును అందుకొన్నారు.